Article Search

ముక్కోటి ఏకాదశి పూజా విధానం

 

పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారుఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయిసూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు.

కార్తీక పురాణము - ముప్పైవ రోజు పారాయణ

 

సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...

 

 

కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ

 

నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...

కార్తీక పురాణము - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ

 

సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, 

 

కార్తీక పురాణము - ఇరవై ఏడవ రోజు పారాయణ

 

విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.

 

కార్తీక పురాణము - ఇరవై ఆరవరోజు పారాయణ

 

విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. 

కార్తీక పురాణము - ఇరవై ఐదవ రోజు పారాయణ

 

పృథువు అడుగుతున్నాడు: 'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడినైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఎలా ఆచరించబడిందో తెలియజేయి' అని కోరగానే, నారదుడు వినిపించసాగాడు.

శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం

 

If you are experiencing any difficulties or problems, start reciting this stotram on a Thursday for 11 days, 3 times every day with faith and belief on Baba that he will surely solve your problem.

 

భీమ సభ ఒక అవలోకనం

 

తూర్పు దిక్కుయందు సముద్రము హద్దు, దక్షిణ దిక్కుయందు వృద్ధ గౌతమి హద్దు, పడమటి దిక్కుయందు గౌతమీ నది హద్దు, ఉత్తర దిక్కుయందు తుల్యభాగానది హద్దు, యీ నాలుగు  హద్దుల మధ్య గల ప్రశస్థమైన భూమియే భీమ మండలము. ఇట్టి మండలమున దక్షారామ గ్రామమున వెలసిన దేవదేవుడే శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరుడు

READ MORE 

 

 

కార్తీక పురాణము - ఇరవై నాలుగవ రోజు పారాయణ

 

ఇక ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు, తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయాలని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరులచేత వధింపబడుతూ వున్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు,

కార్తీక పురాణము - ఇరవైమూడవ రోజు పారాయణము 

 

వీరభద్రుడి మూర్ఛతో  వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరున్ని శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకూ భయకంపితులైన సమస్త గణాలవాళ్ళూ కూడా శివసందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు.

కార్తీక మాసంలో ఏ ఏ  రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?


కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే !! కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్ది మందికే తెలుస్తుంది. అందరికీ కార్తీక శుభ దినాలను ఎలా ని ర్వహించుకోవాలి, ఏం చేయాలి, దేన్ని ఆచరిస్తే

కార్తీక పురాణము - ఇరువైరెండవ రోజు పారాయణ 


 నారద ఉవాచ: ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడిమీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది. 

కార్తీక పురాణము - ఇరవై ఒకటవ రోజు పారాయణము

 

ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినపడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడవాహనంవైపు కదులుతూ 'లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరుడికీ-దేవగణాలకి యుద్ధం జరుగుతుంది. దేవరలు నన్ను ఆశ్రయించారు. నేను వెడుతున్నాను' అని చెప్పాడు.

 

Showing 575 to 588 of 782 (56 Pages)