Article Search

 

పుత్ర సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం ...

 

 

శ్రీమంమాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం

స్కందేష్టాం  జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం

సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శూభ్రాం శుభాం సుప్రభాం

ఆంజనేయస్వామికి 'వడమాల' ఎందుకు సమర్పిస్తారో తెలుసా

 

ఆంజనేయస్వామి బాల్యంలో సూర్యుడిని చూసి పండు అని భ్రమపడి తినడానికి ఆకాశానికి ఎగిరివెళ్ళాడని మనందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో ఒక పరమార్థం వుందిఅదేమిటంటే రాహు దోషం తొలగిపోవడంఅదెలా అంటే … ఆంజనేయస్వామి సూర్యుడిని మింగడానికి నింగికి ఎగురుతున్న సమయంలో రాహువు కూడా సూర్యుడిని మింగడానికి వస్తాడుఅప్పుడు ఆంజనేయస్వామి,

 

ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?

 

హిందూ సాంప్రదాయ పూజలలో తాంబూలానిది అగ్రస్థానంఅందరు దేవుళ్ళకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికీఆంజనేయస్వామికి ఆకుపూజ అత్యంత ప్రీతికరం.
 
ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజిస్తే …
 
ఆంజనేయస్వామికి మాలరూపంలో తమలపాకులను సమర్పిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారువారికోసం ఈ వివరణ 

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం :

 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీస్ముఖ పజ్కజపద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ .

శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ మార్కండేయకృత

 

నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం !

ప్రపద్యే వేంకటేశాఖ్యాం తదేవ కవచం మమ !!

 

శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ స్తోత్రమ్

 

 

సమశ్రియై లోకదాత్ర్యై బ్రంహమాత్రే నమోనమః

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః

 

తిరుప్పావై పాశురము - 30 

 

ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపజేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చివారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకులకొరకును, భగవద్దాస్యమును తమకొరకు పొందిరి. 

తిరుప్పావై పాశురము -29 

 

బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్న చోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవులు వలె సుందరములు రమణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వేకరింపకుండుట తగదు. నేను నీనుండి 'పఱ'ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ … ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను.

తిరుప్పావై పాశురము - 28

 

పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకేన్ని లోపములున్నాను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు.

తిరుప్పావై పాశురము - 27 

 

తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను.

తిరుప్పావై పాశురము - 26 

 

ఆశ్రిత వ్యామోహము కలవాడాఇంద్రనీలమణిని పోలిన కాంతియుస్వభావము కలవాడాఅఘటితఘటినా సామర్థ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడామేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించినీ వద్దకు వచ్చితిమిఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారునీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదనుఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు,

తిరుప్పావై పాశురము - 25

భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టాను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో

తిరుప్పావై పాశురము - 24

 

పూర్వం లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామీ! నీ పాదాలకు మంగళం! లంకలోని రక్కసుల్ని అందర్నీ మట్టుపెట్టినవాడా! నీ బాహుబలానికి శుభమంగళం! శకటాసురుణ్ణి చిన్నపాదాలతో తన్నిన స్వామీ! నీ కీర్తికి మంగళం! వత్సాసురుణ్ణి ఒడిసెలరాయివలె విసిరివేసి, కపిత్థాసురుని కూల్చివేసిన బలశాలీ! నీ అడుగులకు మంగళం ! శుభమంగళం!! గోవర్థనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామీ నీ కృపకు దివ్య మంగళం !

తిరుప్పావై పాశురము - 23

 

వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి, వళ్ళు సాగదీసి విరుచుకొని, గగుర్పాటుగా వళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిసెపుష్పంవలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న ఓ కన్నయ్య! శయన మందిరంనుండి బయలు వెడలి కొలువుమంటపానికి విజయంచేసి సింహాసనంపై

Showing 533 to 546 of 782 (56 Pages)