Article Search
మాఘమాసస్నాన పుణ్య ఫలితాలను వివరించే కథ ...
పూర్వం ఆంధ్రదేశంలోని ఒక పట్టణంలో సుమంతుడు అనే వాడు ఉండేవాడు. అతని భార్యపేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంట అధర్మపరుడు. అడ్డదారిలో ధనం సంపాదించడమే కాకుండా ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినది అంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఎదో పనిమీద గ్రామం వదిలి వెళ్ళాడు.
మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...
మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు.
మాఘమాసం ప్రత్యేకత
చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం.'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మృకుండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.