Article Search

మార్గశీర్షే త్రయోదశ్యాం
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా | దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీర..
లక్ష్మీ నివాసం ఎక్కడ...?
 లక్ష్మీ నివాసం ఎక్కడ...?ఒకసారి నారాయణుడు లక్ష్మీ దేవితో "ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ "నారాయణ” అంటూ జపిస్తున్నారు.ఆ మాటలు విని లక్ష్మీదేవి “అది మీ కోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీమీద భక్తి పెరిగింది అని అంటుంది."అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటంలేదు" అంటాడు నారాయణుడు. “అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు” అంది. సరే అంటాడు నారాయణుడు.నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, “మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు ?” అని అడుగుతాడు.'నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకొంటున్నాను” అంటాడు. గ్రామాధ..
మార్గశిరం మాస విశిష్టతేంటి?
మార్గశిరం@రోజూ పండుగే!- ఈ మాస విశిష్టతేంటి?తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికినీ, అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తిక మాసం పూర్తి చేసుకొని, మార్గశిర మాసంలోకి అడుగు పెట్టిన సందర్భంగా, మార్గశిర మాస విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.  లక్ష్మీ నారాయణునికి ప్రీతికరం మార్గశిరంలక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని ..
లక్ష్మీ దేవి నివాస స్థానాలను
లక్ష్మీ దేవి నివాస స్థానాలను తెలుసుకుని, ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇపుడు చూద్దాము. ఏనుగు కుంభస్థలం, గో పృష్ఠము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపటి ఈ ఐదూ లక్ష్మీ దేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి అనుకుంటే, ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి, దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం.  ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక.  ఇక్కడ మన ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మీ దేవి స్థానాన్ని చూస్తూ చక..
 శ్రీ మహాలక్ష్మీ దేవి
️ శ్రీ మహాలక్ష్మీ దేవి “లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం” శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని.  మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్న..
Dakshinavarti Shankh
Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావృత శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే..
"Sarvadevakrita Lakshmi Stotram".
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ :   క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః దేవద..

లక్ష్మీ కటాక్షం కోసం పాఠించవలసినవి ...?

లక్ష్మీ సంబంధమైన పూజకు పసుపురంగు బట్టలు వేసుకుని పైన శాలువా కప్పుకోవాలి. పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన చేయాలి. కొన్ని కొన్ని నియమాలు సాధారణ వ్యక్తులు పాఠించేలరు కాబట్టి వారి కోసం కొన్ని సూచనలు ...

దీపావళి రోజున అఖండమైన రావిచెట్టు ఆకును కోసుకుని వచ్చి ఆ ఆకులు పూజాస్థలంలో కాని,

పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?

యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు !


 లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. 

Showing 1 to 11 of 11 (1 Pages)