Article Search
కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.