Article Search

 గోదాదేవి జయంతి
నేడు జూలై 22 శనివారం ... గోదాదేవి జయంతి, ఆండాళ్ జయంతి సందర్భంగా...గోదాదేవి జయంతిని తమిళనాట ఆది పూరం అనే పేరుతో పెద్ద పండుగలా జరుపుకుంటారు. పూరం అనేది పూర్వా ఫల్గుణి నక్షత్రాన్ని సూచిస్తుంది. ఆది అనే పేరు గల తమిళ మాసములో పూర్వా ఫల్గుణి నక్షత్రం వచ్చిన రోజున గోదాదేవి జయంతిని జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగను ఆది పూరం అనే పేరుతో వ్యవరిస్తారు. గోదాదేవిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆది పూరం పండుగని వైష్ణవ మరియు శక్తి ఆలయాలలో ఉత్సవంగా జరుపుతారు.గోదాదేవి తన అద్వితీయమైన భక్తితో శ్రీరంగనాథున్ని భర్తగా పొందిన కథ ప్రాచుర్యంలో ఉంది. ఆమె పన్నెండు మంది ఆళ్వారుల్లో ఉన్న ఏకైక స్త్రీగా ప్రసిద్ధి పొందిన..
గోదాదేవి
తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు... విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...

గోదా కల్యాణం

సుమారు ఎనిమిదవ శతాబ్దపు కాలంలో శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాథస్వామి దేవాలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికిందట. పిల్లలు లేని విష్ణుచిత్తుడు ఆ పసిపాపకు కోదై అనే పేరుతొ పిలుచుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాలక్రమంలో కోదై గోదా అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది.

Showing 1 to 3 of 3 (1 Pages)