Article Search
అక్టోబరు 17న సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలుసత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాల..
తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్ సవారి”తిరుమల, 2024 అక్టోబరు 13: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశ..
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలుతిరుపతి, 2024 ఆగష్టు 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు. సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణసెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పత్రోత్సవాలుసెప్టెంబరు 18న శ్రీ గో..
ధ్వజావరోహణంతో
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవాలుతిరుపతి,
2024 జూన్
25:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల
పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు
మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో
ముగిశాయి.రాత్రి
7
గంటలకు
ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.
గరుడ
పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం
నాడు ఆహ్వానించిన సకల దేవతలను
సాగనంపారు.బ్రహ్మోత్సవాలలో
పాలు పంచుకునే వారు సమస్త
పాపవిముక్తులై,
ధనధాన్య
సమృద్ధితో తులతూగుతారని
ఐతిహ్యం.ఈ
కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ
ఈవో శ్రీ గోవింద రాజన్,
ఏఈవో
శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి శ్రీవాణి,
టెంపుల్
ఇన్స్పెక్టర్ శ్ర..
జూన్
17
నుండి
21వ
తేదీ వరకు శ్రీ పద్మావతి
అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలుతిరుపతి,
2024 జూన్
15:
తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి
వార్షిక తెప్పోత్సవాలు జూన్
17
నుండి
21వ
తేదీ వరకు ఐదు రోజుల పాటు
ఘనంగా జరుగనున్నాయి.
ప్రతిరోజు
సాయంత్రం 6.30
గంటల
నుండి రాత్రి 7.30
గంటల
వరకు అమ్మవారు పద్మసరోవరంలో
తెప్పలపై విహరించి భక్తులకు
దర్శనమివ్వనున్నారు.ఈ
ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ
పద్మసరోవర తీరంలో పాంచరాత్ర
ఆగమపూజలు అందుకుని భక్తులను
అనుగ్రహిస్తారు.
ప్రతి
సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ
ఏకాదశి నుండి పౌర్ణమి వరకు
రమణీయంగా తెప్పోత్సవాలు
నిర్వహిస్తారు.
తెప్పోత్సవాల్లో
..
Showing 1 to 5 of 5 (1 Pages)