Article Search

Dakshinavarti Shankh
Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావృత శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే..
"Sarvadevakrita Lakshmi Stotram".
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.  సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ :   క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః దేవద..

లక్ష్మీ కటాక్షం కోసం పాఠించవలసినవి ...?

లక్ష్మీ సంబంధమైన పూజకు పసుపురంగు బట్టలు వేసుకుని పైన శాలువా కప్పుకోవాలి. పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన చేయాలి. కొన్ని కొన్ని నియమాలు సాధారణ వ్యక్తులు పాఠించేలరు కాబట్టి వారి కోసం కొన్ని సూచనలు ...

దీపావళి రోజున అఖండమైన రావిచెట్టు ఆకును కోసుకుని వచ్చి ఆ ఆకులు పూజాస్థలంలో కాని,

పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?

యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చదవాల్సిన మంత్రాలు !


 లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జపం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది. 

Showing 1 to 6 of 6 (1 Pages)