Article Search

మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో
ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణమూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు  "ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీనారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీసాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీభిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలంద..
Mahalaya Paksham Special Pitru Karmalu In Kasi
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులుపుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అ..
కాశీయాత్ర -  కాలభైరవుడు
కాశీయాత్రకు కాలభైరవుని అనుమతి కావలి. అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి., లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు.అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటివాడు. అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు. సాధారణముగా అందరు కాశీలో శివుడిని దర్శించుకొని వస్తారు.అలాకాకుండా కాశీలోని కాలభైరవ ఆలయము, అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ యాత్ర పరి పూర్ణమవుతుంది.త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న సందేహము వారికి వచ్చింది. సందేహ నివృత్తి కోసము వేదాలను ఆశ్రయిస్తే వేదాలు మహేశ్వరుడే గొప్ప వాడని తేల్చి చ..
What we should leave in Kasi?
 ఠంఛనుగా చెప్పిస్తారెవరైనా “కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలీ” అని.ఆమేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం కూడా. అటుతర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం. పైగా “నేను వంకాయలు తిననండీ, కాశీలో ఎప్పుడో వదిలేశాను",  “నేను సీతాఫలాలు తిననండీ…కాశీలో వదిలేశాను” అని చెప్పుకుంటూ అదో గొప్ప విషయంగా ఫీలవుతూంటాం.నిజానికి మన పెద్దలు వదిలేయాలన్నవి “కాయాపేక్ష,  ఫలా పేక్ష" వదులుకోవడం అంటే తినే కాయలు, ఫలాలు వదిలేయటం కాదు. కాయాపేక్ష అంటే:- దేహం పట్ల ప్రేమ.ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని.నా శరీరానికి సుఖం క..
Showing 1 to 4 of 4 (1 Pages)