Article Search

కార్తీక మాస విధులు
కార్తీక మాస విధులు  కార్తీకము బహుళార్థసాధకముగా  శివ కేశవ జగన్మాతలను,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట ప్రధానము.     ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం, మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము.     ఈ మాసమంతా......1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో, పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం  |అశ్వమేధ సహస్రాణాం ఫలం ..
కార్తీకమాసం విశిష్టత
కార్తీకమాసం విశిష్టత  : ప్రాతఃకాల స్నానదానాదులతో - కార్తీక స్నానాలు ప్రారంభం♪. కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪. ఈ మాసంలో వచ్చే... ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి, పుణ్యఫలం చేకూరుతుంది♪.  కార్తీక మాసం మొత్తం మీద - కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో, వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడద..
ఈరోజు అట్ల తద్ది 19/10/2024
ఈరోజు అట్ల తద్ది 19/10/2024సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్..
 ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
హనుమాన్ జయంతి 2024
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.1. ప్రసన్నాంజనేయస్వామి.2. వీరాంజనేయస్వామి.3. వింశతిభుజాంజనేయ స్వామి.4. పంచముఖాంజనేయ స్వామి.5. అష్టాదశ భుజాంజనేయస్వామి.6. సువర్చలాంజనేయ స్వామి.7. చతుర్భుజాంజనేయ స్వామి.8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.9. వానరాకార ఆంజనేయస్వామితంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న ..
Narasimha Jayanthi  : నృసింహ జయంతి
ఈ శ్లోకాలు చదివిన, మనకు మానసిక ఆనందం, ఆరోగ్యం గ్రహబాధ నివారణకి ఈ పారాయణ వల్ల విముక్తి లభిస్తుంది….1:: శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||తా:: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.2::బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత!లక..
చైత్ర మాసం విశిష్టత
చైత్ర మాసం విశిష్టత (09-04-2024 మంగళవారం నుండి 08-05-2024 బుధవారం వరకు) “ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం♪. సంవత్సరానికి తొలి మాసం కూడాచైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రం ..
 How to Do Maha Shivaratri Fasting?
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
భీష్మాష్టమి సందర్భంగా
భీష్మాష్టమి సందర్భంగాహర్యానా : కురుక్షేత్రశ్రీ భీష్మ కుండ్భీష్మ కుండ్ కురుక్షేత్ర థానేసర్‌లోని నర్కటరి వద్ద ఉంది, దీనిని భీష్మపితామహా కుండ్ అని కూడా పిలుస్తారుఇక్కడ భీష్మ ఆలయం ఉంది మరియు మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు అర్జునుడి బాణాల మంచం మీద పడుకున్న ప్రదేశం ఇది.భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే. భీష్మపితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.⚜ స్థల పురాణం ⚜భీష్ముడు గంగాదేవి కుమారుడు మరియు పరశురాముడి శిష్యుడు అయినందున, భీష్ముడు తన కాలంల..
మాస శివరాత్రి  అంటే ఏమిటి?
 మాస శివరాత్రి అంటే ఏమిటి?త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రిమాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు ..
సూర్య మండల  స్త్రోత్రం..
సూర్య మండల  స్త్రోత్రం.. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః  ౧  యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౨  యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్  ౩  యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్&..
సంక్రాంతి అంటే ఏమిటి.?
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు  సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల..
ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ
పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదముఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల&n..
What is the story behind the tradition of Ganesh visarjan?
ధర్మసందేహాలు-సమాధానంప్ర : గణపతి విగ్రహానికి పూజ చేసి, ఎంతోచక్కగా అలంకరించి తిరిగి నీటిలో కలిపేయడం ఎందుకు? పైగా నీటిలో కరగని పెద్ద పెద్ద విగ్రహాలను అలా కలపడం కాలుష్యమే కదా? అలాగే అమ్మవారి నవరాత్రులయ్యాక కూడా నిమజ్జనం చేస్తారు కదా! మరో ప్రక్క గణపతికినవరాత్రులు లేవని, బాలగంగాధర్ తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని ఒకపెద్దాయన ఒక పత్రికలో వ్రాశారు? అది నిజమేనా?జ : గణపతి విగ్రహాన్ని పూజించితిరిగి నీటిలో కలపడంలోనే- మన విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది. విగ్రహాన్ని మాత్రమే దేవుడనుకోరు హిందువులు.ఇంట్లో నిత్యం పూజించే ఇత్తడి, వెండి, బంగారు ప్రతిమలు నిమజ్జన చేయనవసరం లేదు...
Showing 1 to 14 of 16 (2 Pages)