Article Search
హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..