Article Search
కళ్యాణం కమనీయం శ్రీలక్ష్మీనరసింహుని వైభోగం. నేత్రపర్వంగా అంతర్వేది నరసింహుని కల్యాణం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. అలవైకుంఠ ఇలకు వచ్చిందా అన్నట్లు సాగింది నరసింహుని కళ్యాణం. సాగర తీరాన కెరటాలతో పోటీపడుతూ భక్త తరంగాలు అంతర్వేదికి పోటెత్తాయి. ఈ పావన భాగ్యాన్ని చూసిన భక్తులు ఆనంద డోలికలలో మునిగితేలారు.అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం న్ని చూసిన వారి మది తన్మయత్వంతో పులకించింది. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని ..
మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.
గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ..
Showing 1 to 2 of 2 (1 Pages)