Article Search
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
Showing 1 to 1 of 1 (1 Pages)