Weekdays Vrats and There Benifits

వారం రోజులలో రోజుకొక వ్రతం? ఫలితం?


మనకు వారంలో ఏడు రోజులున్నాయి. ఆ ఏడు రోజులకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఏడు రోజులకు ఒక్కో దేవీదేవతలకు ప్రీతికరమైనవి. ఏ రోజున ఏ దేవీ దేవతులకు పూజ చేయాలో, జననమరణాలపై గ్రహాలు చూపించే ప్రభావం వాటిని ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలమిన రోజు ఏదో, వ్రతం ఏదో తెలుసుకుందాం.


ఆదివార వ్రతం


ఆదివారం వ్రతం శుక్లపక్ష ఆదివారం రోజున ప్రారంభించి, సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడం ద్వారా చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం రోజున సూర్యారాధన చేయాలి. ఆదివారం రోజు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుభ్రహ్మన్య స్వామిని ఆరాధించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ఆదివారం రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని అభ్యంగన స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని కేదా ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చడాలి. తరువాత గంగాజలన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి నివేదించాలి. ప్రతి ఆదివారం రోజున ఉపవాసం ఉంటే శ్రేష్ఠం కానీ చేయలేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజ పూర్తయిన తరువాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు వాయనంగా ఇవ్వాలి. సంవత్సరం మొత్తం ఈ వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం నెలకు ఒక్కరోజు అంటే 12 ఆదివారాలైనా చేయాలి.

 

సోమవార వ్రతం


ఈ వ్రతాన్ని శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాలలో శుక్లపక్ష సోమవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. భక్త సులభుడు, కోరిన కోర్కెలను అడగగానే తీర్చే భోలాశంకరుడు మరియు మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసాన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈ వ్రతం ఎలా చేయాలంటే చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో స్నానం చేస్తూ 'ఓం నమశ్శివాయ' అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. స్నానంతరం శివపర్తవుల అష్టోత్తరం, అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. వ్రతం చేసే రోజున ఉపవాసం ఉంటే శ్రేష్ఠం, అలాగే చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగిపోవడానికి తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. సూర్యుడిని చంద్రాష్టోత్తరం పఠించాలి. ఉద్యాపన రోజున దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్త్రాలు, వస్తువులు, పళ్ళను దానం చేయాలి. ఈ వ్రతాన్ని సంవత్సరం పొడువునా చేయలేనివారు కనీసం 16 lలేదా 5 సోమవారాలు ఈ వ్రతం ఆచరించాలి.


 మంగళవార వ్రతం 


మంగళవార వ్రతం ఏ మాసంలో అయినా శుక్లపక్షంలోని మంగళవారం రోజున ప్రారంభించాలి. ఈ రోజున ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను పొందడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవార వ్రతాన్ని ఆచరించాలి. మంగళవార వ్రతానికి  రాగిపాత్ర, ఎఱ్ఱని వస్త్రాలు, ఎరుపురంగు పువ్వులు, కొబ్బరికాయలను ఉపయోగించి పూజ చేయాలి. ఈ వ్రతం చేయడం వలన శత్రుజయం సిద్ధిస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, రక్తపోటు తదితర రోగాలు, ఋణబాధలు, దీర్ఘకాలిక బాధల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే కుజగ్రహ దోష నిర్మూలన కోసం ఈ వ్రతాన్ని ఆచరించేవారు కుజ అష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి. సంవత్సరం పొడవునా చేయలేనివారు కనీసం 21 వారాలపాటు తప్పనిసరిగా చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మరింత శ్రేష్ఠం.


బుదవార వ్రతం 

బుదవార వ్రతాన్ని ఏ మాసంలో అయినా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజున ప్రారంభించి 21 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుదవార వ్రతం స్థితికారుడు, శిష్టరక్షకుడు, భక్తజన పాలిట కల్పవృక్షం అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మరియు బుధగ్రహ వ్రతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగం, వ్యాపారాలను వెనుకంజ వేస్తున్నవారు ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. బుధవర వ్రతం చేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. పచ్చరంగు వస్త్రాలను ధరించాలి, ఆకుకూరలు, పచ్చ అరటిపళ్ళు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమె సేవించాలి. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. గోవులను పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం.


గురువార వ్రతం


గురువార వ్రతాన్ని ఏ నెలలో అయిన శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం నాడు ప్రారంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడు సంవత్సరాలపాటు ఆచరించాలి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధి పొందాలనుకునేవారు, దక్షిణామూర్తి, షిర్డీ సాయిబాబా, గురు రాఘవేందర్స్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. అలాగే గురుగ్రహ వ్యతిరేక ఫలితాలు అయిన విద్యా, ఉద్యోగ ప్రతికోలతలు, అవమానాలు, అవహేలనల నుండి తప్పించుకోవాలని అనుకునేవారు గురువార వ్రతాన్ని ఆచరించాలి. అభ్యంగన స్నానం చేసిన తరువాత పసుపు రంగు వస్త్రాలు, పసుపురంగు కంకణాన్ని ధరించాలి. కంచులోక పాత్రలో పసుపు అక్షతలను, పసుపు వువ్వులను, పసుపు, పసుపు కలిపిన చందనాన్ని   ఉపయోగించి ఆయా దేవుళ్ళను అష్టోత్తరాలతో పూజించాలి. తరువాత పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర పళ్ళను నివేదించాలి. అలాగే గురుగ్రహ అనుకూలతను ఆశించేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఈ రోజున తప్పకుండా ఒక పూట ఉపవాసం ఉండి, స్వామికి సమర్పించిన పదార్థాలను సేవించాలి.


శుక్రవార వ్రతం


శుక్రవార వ్రతాన్ని శ్రావణమాసం లేదా ఏ మాసంలో అయినా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారం రోజున ఆరంభించి 16 వారాలపాటు వ్రతాచరణ నిర్వహించాలి. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సంతోషీమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే గ్రహాలలో శుక్రగ్రహ వ్యతిరేక ఫలాను తొలగించుకోవడానికి ఈ శుక్రవార పూజ శ్రేష్టమైనది. ఈ వ్రతం ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపురంగు పువ్వులు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేయాలి. నైవేద్యంగా క్షీరాన్నం, చక్కర ప్రసాదాన్ని నివేదించిన తరువాత స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోసం మూలమంత్రాన్ని పఠించాలి.


శనివార వ్రతం


శనివార వ్రతాన్ని శ్రావణ మాసం లేదా పుష్య మాసంలో వచ్చే మొట్టమొదటి శనివారం రోజున ఈ వ్రతాన్నిప్రారంభించి కనీసం 19వారాలపాటు ఆచరించాలి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందాలనుకునేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం ఆచరించాలి. శనివారం రోజున అభ్యంగన స్నానం చేసిన తరువాత పరిశుభ్రమైన వస్త్రాలను దించి శ్రీవేంకటేశ్వరస్వామి అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. పగలు అల్పాహారం తీసుకున్నా రాత్రి మాత్రం పండ్లు, పాలను సేవించాలి. ఉద్యాపన రోజున నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానం చేయాలి.  

 

Products related to this article

Vippa Flower (50 Grams)

Vippa Flower (50 Grams)

Vippa Flower ..

$4.43

Rudraksha Mala with 53 Beeds and 4 Face Rudraksha Beed

Rudraksha Mala with 53 Beeds and 4 Face Rudraksha Beed

Rudraksha mala with 53 Beeds 4 Face Rudraksha BeedRudraksha mala with 53 Beeds and 4 Face Rudraksha Beed (Chaturmukhi Rudraksha) , and this mala moulded in Silver. this mala for Education, C..

$141.00

Shell Ganesha(Big size)

Shell Ganesha(Big size)

Shell Ganesha(Big size)..

$10.00 $10.00

Ekakshi Naarikela

Ekakshi Naarikela

Ekakshi NaarikelaEkakshi means one eyed, Generally a coconut has three black spots which are consider as two eyes and one mouth but out of millions you will find one coconut which consist of one eye a..

$4.00

0 Comments To "Weekdays Vrats and There Benifits"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!