సౌభాగ్యగౌరీ వ్రతం
శివడోలోత్సవం చైత్ర శుద్ధ తృతీయ రోజున పండుగ జరుపుకుంటారు. వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులలో ఇది మూడవరోజు . పంచాంగకర్తలు దీన్నే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా అంటారు. ఈ రోజున ఉమాశివులకు దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహించినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ వ్రతానికి విదియతో కూడిన తదియ పనికిరాదని, చవితితో కూడిన తృతీయ ముహూర్తం ఉండాలి. డోలోత్సవ పర్వం హిందూదేశంలోని పలుప్రాంతాల్లో వివిధ రీతులలో నిర్వహిస్తుంటారు. ఈ వ్రతాచరణ స్త్రీలు ఎక్కువగా ఆయా ప్రాంతాలలో కనిపిస్తారు. అంతేకాక ఇది ప్రత్యేకంగా స్త్రీ దేవతపేర సౌభాగ్యగౌరీ వ్రతం వివిధ నామాలలో వ్యవహరింప బడుతూ ఉంది.సతీదేవి దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతి అయి చనిపోయిన హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది.
Note: HTML is not translated!