Katyayani Vratam

కాత్యాయని వ్రతం

ముందుగా గణపతి పూజ చేసుకున్న తరువాత మండపంలో ఉన్న కలశంపైన ఒక పుష్పాన్ని తీసుకుని ... అస్మిన్ కలశే సమస్త తీర్థాదినం వారుణ మావహయామి' అని కాత్యాయనీ దేవిని కలశంలోకి ఆవాహన చేయాలి. పుష్పాన్ని వుంచి తిరిగి పుష్పం తీసుకుని ...

శ్లో అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం

మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి

అంటూ కలశంలో పుష్పాన్ని వుంచి ఈశ్వరుని ఎడమతొడపై కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించాలి.

ధ్యానం :

శ్లో  ధ్యాయామి దేవీం సకలార్థదాత్రీంచతుర్భుజం కుంకుం రాగాశోనాం

ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే

కాత్యాయని మహాదేవి శంకరార్థ స్వరూపిణి

కళ్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యానం సమర్పయామి అని ఎర్రటి పుష్పాన్ని అమ్మవారి ముందు ఉంచాలి.

ఆవాహం : 

శ్లో  సర్వదోష ప్రశమని సర్వాలంకార సంయుతే

యావత్వాం పూజయిష్యామి తావత్వాం సుస్తిరాభవ

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆవాహయామి

రత్నసింహాసనం:

శ్లో   భౌమవారే ప్రియే దేవి కుజదోష నివారణి

స్కందమాత్రే స్వర్ణ రత్న మసనం ప్రతిగృహ్యతాం

శ్రీ కాత్యాయని దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి

పాద్యం :

శ్లో గంగాది సరస్వతీర్థైశ్చ శోభితం చ సువాసితం

పాద్యం గృహాణ వరదే హోవ్రి కళ్యాణ కారినీం

శ్రీ కాత్యాయని దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి పుష్పంతో నీళ్ళు చల్లాలి.

అర్ఘ్యం :

శ్లో శుద్దోదకం సువిమలం గంధ పుష్పాది మిశ్రితం

అర్ఘ్యం దాస్యామితే దేవీ గృహ్యతాం శివవల్లభే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం :

శ్లో సువర్ణ కలశానీతం చందనాగురు సంయుక్తం

గృహాణ ఆచమనీయం దేవి మయాదత్తం శుభప్రదే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి

స్నానం :

శ్లో  గంగా గోదావరి దేవ్యై తీర్ధైశ్చ మిళితం శుభం

శుద్దోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి

శ్రీ కాత్యాయని దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి

వస్త్రం :

శ్లో సురార్చితాంఘ్రే యుగాళే దుకూల వాసనాప్రియే

రక్త వస్త్ర ద్వయం దేవీ గృహ్యతాం సురపూజితే

శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి

మంగళం :

శ్లో తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం

మయా సమర్పితం దేవీ గృహ్యతాం శివవల్లభే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళప్రద మాంగళ్యం సమర్పయామి

ఆభరణాలు :

శ్లో. సువర్ణ భూషణా దేవీ నవరత్న మయానిచ

సమర్పయామి హి దేవీ స్వీ కరుష్య శుభప్రదే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః సర్వాభారణాను సమర్పయామి

గంధం :

శ్లో. కర్పూరాగురు కస్తూరి రోచనాది సుసంయుతం

గంధం దాస్యామి శుభగే స్వీ కరుష్వ శుభప్రదే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః గంధం సమర్పయామి

అక్షతలు :

శ్లో అక్షతాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్గో

మృతాక్తాన్ స్వీ కురుష్వ మహేశ్వరి

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి

అథాంగ పూజ :

ఉమాయై పాదౌ పూజయామి
పార్వత్యై నమః   జానునీ పూజయామి
 జగన్మాత్రే నమః  ఊరూ పూజయామి
జగత్ప్రతిష్టాయై నమః  కటిం పూజయామి
మూల ప్రకృత్యై నమః నాభిం పూజయామి
అంబికాయై నమః  ఉదరం పూజయామి
అన్నపూర్ణాయై నమః  స్థనౌ పూజయామి
 శివ సుందర్యై నమః  వక్షస్థలం పూజయామి 
మహా బలాయై నమః  బాహున్ పూజయామి
 గౌర్యై నమః జంఘే పూజయామి 
 శ్రీ పాదాయి నమః   హస్తాన్ పూజయామి
  కుంభుకంట్యై నమః    కంఠం పూజయామి
 బ్రహ్మవిద్యాయై నమః  జిహ్వం పూజయామి
  శాంకర్యై నమః  ముఖం పూజయామి 
శివాయై నమః  నేత్రే పూజయామి 
రుద్రాన్యై నమః  కర్ణౌ పూజయామి 
సర్వంగాలాయై నమః  లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః   శిరః పూజయామి 
మంగళ గౌర్యై నమః  సర్వాణ్యంగాని పూజయామి

 

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అష్టోత్తర శతనామావళి :

 

ఓం గౌర్యై నమః  ఓం కర్మ బ్రమ్హై నమః
ఓం గిరిజాతనుభావాయై నమః ఓం వాంచితార్థయై నమః   
ఓం జగన్మాత్రే నమః  ఓం చిదంబర శరీరిన్యై నమః
ఓం వీరభద్ర ప్రసువే నమః  ఓం దేవ్యై నమః 
 ఓం విశ్వరూపిన్యై నమః  ఓం కమలాయై నమః
ఓం కష్ట దరిద్రషమన్యై నమః ఓం మార్కండేయ వరప్రదాయి నమః  
 ఓం శాంభావ్యై నమః  ఓం పుణ్యాయై నమః
ఓం బలాయై నమః  ఓం సత్యధర్మరతాయై నమః 
ఓం భాద్రదాయిన్యై నమః ఓం శశాంక రూపిణ్యై నమః 
ఓం సర్వ మంగళాయై నమః ఓం భాగలాయై నమః 
 ఓం మహేశ్వర్యై నమః  ఓం మాతృకాయై నమః 
 ఓం మంత్రారాద్యై నమః ఓం శూలిన్యై నమః 
ఓం హేమాద్రిజాయై నమః  ఓం సత్యై నమః 
ఓం పార్వత్యై నమః ఓం కళ్యాన్యై నమః 
 ఓం నారాయణసంశాజాయై నమః ఓం సౌభాగ్యదాయిన్యై నమః
 ఓం నిరీశాయై నమః  ఓం అమలాయై నమః 
ఓం అంబికాయై నమః ఓం అన్నపూర్ణాయై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః  ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః ఓం అంబాయై నమః 
ఓం కన్యకాయై నమః ఓం భానుకోటి సముద్రతాయై నమః  
ఓం కలిదోష నివారిన్యై నమః ఓం పరాయి నమః
ఓం గణేశ జనన్యై నమః ఓం శీతాంశు కృత శేఖరాయై నమః 
ఓం గుహాంబికాయై నమః ఓం సర్వకాల సుమంగళ్యై నమః 
ఓం గంగాధర కుటుంబిన్యై నమః  ఓం సామ శిఖరాయై నమః 

ఓం కలిదోష నివారిన్యై నమః 

ఓం వేదంగా లక్షణాయై నమః 
ఓం అష్టమూర్తిత్మికాయై నమః  ఓం కాక కలనాయై నమః 
ఓం శివాయై నమః  ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః 
ఓం శాంకర్యై నమః ఓం శ్రీచక్ర వాసిన్యై నమః 
ఓం భావాన్యై నమః  ఓం కామేశ్వర పత్న్యై నమః  
ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం మురారి ప్రియార్థానై నమః
ఓం మంజు భాశిన్యై నమః  ఓం పుత్రపౌత్ర వర ప్రదాయి నమః 
ఓం మహా మాయాయై నమః  ఓం పురుషార్థ ప్రదాయి నమః 
ఓం మహా బలాయై నమః  ఓం సర్వ సాక్షిన్యై నమః 
ఓం హేమవత్యై నమః  ఓం శ్యామలాయై నమః 
ఓం పాప నాశిన్యై నమః  ఓం చంద్యై నమః 
ఓం నిత్యాయై నమః ఓం భాగమాలిన్యై నమః 
 ఓం నిర్మలాయై నమః  ఓం విరజాయై నమః 
ఓం మృదాన్యై నమః  ఓం స్వాహాయై నమః 
ఓం మానిన్యై నమః  ఓం ప్రత్యంగి రాంబికాయై నమః 
ఓం కుమార్యై నమః     ఓం దాక్షాయిన్యై నమః 
ఓం దుర్గాయై నమః ఓం సూర్య వస్తూత్తమాయై నమః 
ఓం కత్యాయిన్యై నమః  ఓం శ్రీ విద్యాయై నమః 
ఓం కలార్చితాయై నమః ఓం ప్రణవాద్యై నమః
ఓం కృపాపూర్ణాయై నమః  ఓం త్రిపురాయై నమః 
ఓం సర్వమయి నమః  ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం సరస్వత్యై నమః   ఓం స్వధాయై నమః 
ఓం అమర సంసేవ్యాయై నమః ఓం ఆర్యాయై నమః 
 ఓం అమృతేశ్వర్యై నమః  ఓం దీక్షాయై నమః 
ఓం సుఖచ్చిత్పుదారాయై నమః ఓం శివాభిదానాయై నమః 
ఓం హిరణ్మయై నమః  ఓం ప్రణవార్థ స్వరూపిన్యై నమః 
ఓం సూక్ష్మాయై నమః  ఓం నాద రూపాయి నమః 
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః  ఓం త్రిగుణాంబికాయై నమః 
ఓం సర్వభోగప్రదాయై నమః ఓం శ్రీ మహాగౌర్యై నమః
 ఓం సామ శిఖరాయై నమః  ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః 

    నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి

ధూపం :

శ్లో  దశాంగం గగ్గులోపేతం సుగంధంచ సుమనోహరం

ధూపం దాస్యామి తే దేవీ గృహాణ త్వం సురేశ్వరి

శ్రీ కాత్యాయిని దేవ్యై నమః దూపమాఘాపయామి

దీపం :

శ్లో  కాత్యాయిని మహాదేవి సర్వాలంకార సంయుతే

దీపం దాస్యామి భో మాతః స్వీకురుష్వ సుశోభనే

శ్రీ కాత్యాయిని దేవ్యై నమః దీపం సమర్పయామి

దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పాలతో కలశంలోని నీళ్ళు చల్లవలెను.

నైవేద్యం :

శ్లో  అపుపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షు ఖండైశ్చ సంయుతాన్భా

క్ష్యాన్ ఘాతాక్తాన్ దేవి స్వీ కురుష్వ మహేశ్వరి

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఇక్షు ఖండ సహిత లవణాన్ అపుపాన్ నివేదయామి

ఒక పళ్ళెంలో ఏడు ఉప్పు వేసి వండిన అప్పాలు, చెరుగుగెడలోని ఏడు ముక్కలు అమ్మవారి ఎదుట వుంచి ఆమెకు నైవేద్యం సమర్పించాలి

తాంబూలం :

శ్లో యాలా లవంగా కర్పూర పూగీఫల సుశోభితం

తాంబూలంచ ప్రదాస్యామి స్వీకురుష్వ శివప్రియే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం :

శ్లో మృత వర్తి త్రయోపేతం నీరాజన మిదం శివే

స్వీకురుష్వ మహాదేవి పాపం నాశయ సత్వరం

శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ నీరాజనం సమర్పయామి

ఆవునేతితో తడిపిన మూడు వత్తులను హారతిగా అమ్మవారికి చూపించాలి.

మంత్రం పుష్పం :

శ్లో  శివే హరిప్రియే దేవి కాత్యాయని వరప్రదే

పుష్పాంజలి మిదం తుభ్యం దాస్యామి సురపూజితే

శ్రీ కాత్యాయని దేవ్యై నమః సువర్ణ పుష్పాంజలి సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాలు :

శ్లో గౌ భవాని రుద్రాణి శర్వాణి శంకర ప్రియే

ప్రదక్షిణం కరిష్యామి పాపాన్నాషయ సత్వరం

శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

ప్రార్థన :

దేవ దేవి మహాదేవి శంకరార్థ స్వరూపిణి, కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని, తవపూజా భక్తి యుక్త చేతసాహం సదాముదా, కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు, గ్రహదోషాది దుర్దోషాన్ క్షిప్రం నాశయ శాంభవి. కళ్యాణం కురుమే దేవి సౌభాగ్యంచ ప్రయశ్చమే, శ్రీ కాత్యాయని దేవ్యై నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, పుష్పాన్ని కానీ, అక్షతలు కానీ అమ్మవారి ముందు వుంచి ఆమెను ప్రార్థించాలి.

అన్యా ధ్యాన ఆవాహనాది ఎకవింశత్యుపచార పూజయా భగవాన్ సర్వాత్మికా శ్రీ కాత్యాయని దేవతా సుప్రీతాసుప్రసన్న వరదా భవతు. అని చెప్పి అక్షతలు చేతిలో ఉంచుకుని నీళ్ళు పోసుకుని అమ్మవారి ముందు విడిచిపెట్టాలి. ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకుని కథను చదువుకుని కథాక్షతలు అమ్మవారి మీద వేసి తరువాత శిరస్సుపై వేయించుకోవాలి.

శ్రీ కాత్యాయని దేవి వ్రతకథ :

పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునులు అందరూ బహుపురాణాలు ఎరిగిన వ్యాస శిష్యుడైన సూత మహర్షిని చూసి భక్తితో ప్రణమిల్లి 'ఓ మహర్షీ! నీవు ఎన్నో పురాణాలను వినిపించావు మరియు సందర్భానుసారంగా వ్రతాలను, వ్రత మహాత్యాలను తెలిపావు. అయ్యా! ఇప్పుడు మాకు ఒక ధర్మసందేహం తీర్చాలి' అని కోరారు. అప్పుడు సూత మహర్షి ఒప్పుకుని ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్షప్రజాపతి యజ్ఞకుండంలో పడి దేహత్యాగం చేసింది కదా. ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేక పోయాడా? లేక సతీదేవి పట్ల అనురాగం లేకపోవటం వలన మౌనంగా ఊరుకున్నాడా? ఈశ్వరుడికి భార్యా వియోగం ఎలా సంభవించింది? మా సందేహాలను తొలగించు అని సూత మహర్షిని వేడుకున్నారు. అప్పుడు సూత మహర్షి 'ఓ మునులారా! మీ సందేహాలను తప్పక పోగొడతాను. సావధానంగా వినండి అని ఇలా చెప్పసాగాడు.

దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవి ఈశ్వరుడికి భార్యగా ఇచ్చాడు. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసంలో సుఖంగా ఉంది. కృత యుగం అంతా గడిచింది. త్రేతాయుగంలో ఒకరోజు సతీదేవి ఈశ్వరుడితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా అంతర్థానం అయ్యాడు శివుడు. సతీదేవి, ఈశ్వరుడు మాట్లాడుతూ మాయమైనందుకు పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఉండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. సతీదేవి పరమేశ్వరుని చూసి 'ఓ నాథా! మీకు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు నవ్వుతున్నారు? నేను ఏమైనా తప్పు మాట్లాడానా?' అని ప్రశ్నించింది. వెంటనే పరమేశ్వరుడు 'ఓ సతీ! నాకు విష్ణువు తండ్రివంటి వాడు నేను అతనికి తండ్రి వంటి వాడిని, మా యిరువురికి ఏ విధంగా అంతరం లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకోసం తన భార్య అయిన సీతతో, సోదరుడు లక్ష్మణుడితో వనవాసానికి వెళ్ళి పంచవటి తీరంలో పర్ణశాల నిర్మించుకుని నివశిస్తూ ఉన్నాడు.

మన భక్తుడైన రావణుడు మాయోపయంతో సీతను అపహరించి లంకకు తీసుకుపోయాడు. పర్ణశాలలో సీత కనిపించక శ్రీరాముడు ఆమెను వెదుకుతూ ఆ అడవి అంతా గాలించాడు. సీత ఎక్కడా కనిపించక, శ్రీరాముడు సీతా వియోగ బాధతో కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనిపించిన పక్షిని, మృగాన్ని, చెట్టును, పుట్టను, రెమ్మను సీతను చూశారా? అని అడుగుతూ వెళుతున్నాడు. ఒక చోట పాడుబడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు ఎలుగెత్తి 'ఓ పరమశివా! నా సీతను చూశావా?' అని ప్రశ్నించాడు. నా తండ్రి అయిన విష్ణువు కేక విన్నవెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముడి ఎదుట నిలబడ్డాను. కాని మానవ రూపంలో ఉన్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే నేను నవ్వుతున్నాను. అంతే తప్ప మరి ఎలాంటి కారణం లేదు సుమా' అని చెప్పాడు. ఆ మాటలు విన్న సతీదేవి 'ఓ నాథా! మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి భార్యావియోగంతో మతి తప్పాడమేమిటి? సీత కోసమని రాముడు పిచ్చివాడిగా సంచరిస్తాడా? ఇవి నమ్మశక్యంగా లేవు. మీరు పరిహాసం ఆడుతున్నారు. మహావిష్ణువు, శ్రీరాముడిగా అవతరించినంత మాత్రం మిమ్మల్ని చూడలేక పోవడమా?' అని అడిగింది. వెంటనే శివుడు 'సతీ ! నీవు నా మాటలు నమ్మని యెడల స్వయంగా నువ్వే అక్కడికి వెళ్ళి ఆ రాముడిని సీతా వియోగ బాధను కన్నులారా చూడు. అంతా నీకు బోధపడగలదు అని అన్నాడు.

వెంటనే సతీదేవి 'ఓ నాథా! నేను రాముని పరీక్షించి రాగల'నని పలికి అదృశ్యమై పంచవటి తీరంలో శ్రీరాముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రన్దనను విని సందేహాస్పదమై రాముని పరీక్షించదలచి 'నేను సీతగా మారిపోవాలి' అని తలంచినది. వెంటనే సతీదేవి సీతాదేవిగా రూపం పొందింది. అదే సమయంలో కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి శ్రీరాముడిని ఏ విధంగా పరీక్షిస్తుందో అని అనుకుని రహస్యంగా ఆ ప్రాంతానికి చేరుకొని సీతా మహాదేవిని చూసి కనులు మూడుకుని చేతులు మడిచి నమస్కారం చేసి మళ్ళీ చూడగానే ఆమె అభిముఖంగా వెళ్ళడం చూసాడు. అప్పుడు శివుడు నా తల్లి, నా తండ్రి దగ్గరికి వెళుతుంది అని సంతోషించసాగాడు.

ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కరించి 'ఓ జగన్మాతా! నన్ను మోసగించాలని అనుకున్నావా? నాకు నా భార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపంలో కనపడుతుంది'. అని అన్న వెంటనే సతీదేవి తన నిజరూపంలో 'ఓ రామా! నిన్ను పరీక్షించడానికే నేను సీత రూపాన్ని దాల్చాను. నీ సీత ఎక్కడ వున్నా మహాసాద్వియై ఉండగలదు' అని చెప్పి అదృశ్యమైంది. శివుడు కూడా జరిగినది అంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి చేరుకొని ఏమీ తెలియని వాడిలా మౌనంగా ఉన్నాడు. ఇంతలో తన దగ్గరికి వచ్చిన సతీదేవి 'ఓ నాథా! నేను వెళ్ళి శ్రీరాముడిని పరీక్షించాను, నిజంగా అతడు మహావిష్ణువు అయి ఉండి కూడా మానవుడిలా, పామరుడిలా నటిస్తున్నాడు' అని పలికింది. వెంటనే శివుడు 'ఓ సతీ! అతనిని ఎలా పరీక్షించావు?' అని ప్రశ్నించాడు. సతీదేవి వెంటనే 'ఓ నాథా! నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించాను' అని చెప్పింది. అపుడు శివుడు 'నీవు దాల్చిన నా తల్లి రూపాన్ని ఇప్పటికి నా కన్నులకు కనబడుతుంది. నీవు నా తల్లివి, అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, 'నేను సందేహించడం ఒకతప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్దమాడటం మరియొక తప్పు, దీంతో నేను కళంకాన్ని పొందాను. ఈ కళంకిత రూపంతో ఈశ్వరుని అర్థాంగిగా ఉండే అర్హత కోల్పోయాను. అందుకే దయామయుడైన పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తాను అని శిక్షించాడు. అని అనేక విధాలుగా ఆలోచించి, కళంకితమైన తన దేహాన్ని త్యజించడానికి నిశ్చయించుకుంది. తన దేహాన్ని విడిచి పెట్టడానికి అనేక విధాలుగా ఆలోచించి చివరకు తను ఏ ఇంట పుట్టిందో అక్కడే తన దేహాన్ని వదలడం ఉత్తమం అని సతీదేవి నిశ్చయించుకుంది. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞం చేయాలనే కోరికను కలిగించింది.

ఆ తపస్సుతో ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించాడు. శివుడు సప్తమహర్షులను, హిమవంతుని దగ్గరకు కన్యను పరిణయమాడటానికి పంపించాడు. ఆ మహర్షులు హిమవంతుని దగ్గరకు వెళ్ళి పరమశివుడికి పార్వతిని ఇవ్వడానికి సంసిద్ధం చేశారు. ఒక శుభలగ్నంలో అత్యంత వైభవోపేతంగా శివపార్వతుల కళ్యాణాన్ని బ్రహ్మ స్వయంగా జరిపించాడు. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో వుండగా మన్మథుని భార్య అయిన రతీదేవి శివుడి పాదాలపై పడి తన భర్తను బ్రతికించమని ప్రార్థించగా శివుడు సంతోషంతో మన్మథుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించే విధంగా చేసి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. దేవతలు అందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మనా ఆనందం పొంది ఆ దంపతులపై పూలవర్షం కురిపించారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో 'ఓ నాథా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషం వలన గగజన్మలో నేను సందేహాస్పదనై అబద్దం చెప్పి నీకు దూరమై శరీర త్యాగం చేశాను. తిరిగి అతడు నీ లలాటం నుండి బిందువు రూపంలో నీకు దూరం కావడమ వలన మళ్ళీ నేను నీకు దగ్గరయ్యాను.

0 Comments To "Katyayani Vratam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!