విశ్వరూప వీరభద్రుడు...శ్రీ శైల క్షేత్ర పాలకుడు.......!!
శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు.
ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా
వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా
కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు.
శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే
కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో,
ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు.
ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. ముప్పై
రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది. ఈ స్వామిని
దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శతృబాధలు తొలగి, సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో
చివరిదైన వాతులాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని,
ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి.