Thirupavai-Pashuram-17

తిరుప్పావై పాశురము - 17 

 

అమ్బరమే, తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్

ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,

కొమ్బనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే

ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!

అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద

ఉమ్బర్ కోమానే! ఉఱుజ్ఞ్గదెళున్దిరాయ్

శెమ్ పొర్కళ లడిచ్చెల్వా! బలదేవా!

ఉమ్బియమ్ నియు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్ 

 

శ్రీకృష్ణ బలరాములకు గోదాదేవి మేలుకొలుపు

 

సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ! నందగోపస్వామీ! నిద్దురమేలుకొనవయ్యా! మానినీ మణులందరిలోను మిన్నయై వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న యశోదమ్మా! నిద్దుర మేలుకోవమ్మా!! ఆకాశాన్ని ఛేదించుకొంటూ పెరిగి లోకాలన్నింటిని త్రివిక్రముడవై కొలిచిన దేవాదిదేవా! శ్రీకృష్ణ! నిదురచాలించి మేలుకో స్వామీ!! కాళ్ళకు ఎఱ్ఱని రాళ్ళతో మెరుస్తున్న బంగరు కడియాలు ధరించిన బాలరామా! నీవూ నీ తమ్ముడు శ్రీకృష్ణునితోకూడ నిద్దురమేల్కొని, మమ్ము ఏలవయ్యా! మీరంతా లేచి మా వ్రతాన్ని ఫలింపజేయరయ్యా!  

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Hematite Bracelet

Hematite Bracelet

HematiteThis particular crystal is often used to ground and balance you in your life. It can be the perfect stone to have if you are under stress and need to feel calm and centered. This crystal can..

$22.00

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

$25.00

0 Comments To "Thirupavai-Pashuram-17"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!