Some Interesting Facts about Lord Krishna

Some Interesting Facts about Lord Krishna

కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.....


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుపరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. త్రేతా యుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే. అటువంటి భగవంతుడు చిన్ని కృష్ణయ్యగా గోపికలందరి ఆటపట్టించాడు. వెన్నదొంగగా పేరు తెచ్చుకున్నాడు. అటు ధర్మబద్ద జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడుగా నిలిచాడు శ్రీకృష్ణుడు.

అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడుఅవతార పురుషుడిగా.. శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు రోహిణి నక్షత్రముతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు. అందుకే ఈ రోజుని కృష్ణాష్టమిగా... జన్మాష్టమిగా పిలుస్తారు. దుష్టులను శిక్షిస్తూ..శిష్టులను రక్షిస్తూ ధర్మసంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. లోక కల్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు.


కృష్ణుడు ఒక తత్వవేత్త. ఒక కర్మవాది. వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో ఎన్ని యుగాలైన ముందు ఉండేది భగవద్గీతను చెప్పిన ఉపాద్యాయుడు. ఒక నాయకుడు ఎలా ఉండాలో.. ఎలాంటి ప్రణాళికలు విజయానికి మార్గం చూపిస్తాయో చెప్పాడు. గోవర్థన గిరిని పైకెత్తి ఇంద్రుని అహంకారం నుంచి యాదవుల అందరిని రక్షించాడు. ప్రతి సమస్యకు పరిష్కరం చూపుతూ కర్తవ్య దీక్షలో వున్నాడు. తనపై పడిన నీలాప నిందలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. తనను విమర్శించిన వారే చేతనే పూజలను అందుకున్న గోపాలుడు శ్రీకృష్ణుడు.


మాధవుడు అంటే ఒక మధురం. ఆయన అవతారం అపురూపమైన అందం. ఆయన అందం మిగిలిన దేవుళ్లలందరిలో టోటల్ డిఫరెంట్ అని చెప్పాలి. ఇగ సృష్టిలో సంభోగం చేయని ఒకే ఒక్కజీవి నెమలి. అందుకే ఆ పరమాత్ముడు శిరస్సుపై నెమళి పించెం ధరించి అస్కలిత బ్రహ్మచారిగా కీర్తింపబడ్డాడు. చేతిలో మిలమిల మెరిసే పిల్లన గ్రోవి ఉంటుంది. ఒక పనిని ఎలా సమర్థవంతంగా చేయాలో.. కార్య సాధకుడు అంటే ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడిని చూస్తే తెలుస్తుంది.


శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడని కథనం. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)మాసం : శ్రావణం.. తిథి: అష్టమి..నక్షత్రం : రోహిణి.. వారం : బుధవారం..సమయం : రాత్రి గం.00.00 నిమిషాలకు మథురలో జన్మించారు.

  Shop Now For Ganesh Chaturthi : https://www.epoojastore.in/special-items/ganesha-chaturthi-special

శ్రీ కృష్ణుని జీవిత కాలం ..125 సంత్సరాల 8 నెలల 7 రోజులు.. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)...శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.. కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగశిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.


భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి: మధురలో కన్నయ్య...ఒడిశాలో జగన్నాథ్.. మహారాష్ట్ర లో విఠల (విఠోబ).. రాజస్తాన్ లో శ్రీనాధుడు.. గుజరాత్ లో ద్వారకాదీసుడు & రణ్‌చోడ్,ఉడిపి, కర్ణాటకలో.. కృష్ణ..


జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.. జన్మనిచ్చిన తల్లి దేవకీ.. పెంచిన తండ్రి నందుడు..పెంచిన తల్లి యశోద.. సోదరుడు బలరాముడు...సోదరి సుభద్ర.. జన్మ స్థలం మధుర శ్రీ కృష్ణుని భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ.. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర – కుస్తీదారు.. కంసుడు - మేనమామ శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు...


శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు... శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.


కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు