శ్యామలా నవరాత్రులు

శ్యామలా నవరాత్రులు

శ్యామలా నవరాత్రులు



మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు(10 Feb 2024).
శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్రీ శ్రీ శ్రీ లలిత పరాభట్టారిక శ్యామల దేవికి తన రాజముద్ర ఇచ్చినది అంటే ఆమె ఔచిత్యమును తెలుసుకోవచ్చును. ఈ విషయములు బ్రహ్మాండ పురాణములో లలితోపాఖ్యానము లో, లలితా సహస్రనామము యందు ఉన్నది. రాజశ్యామలే మీనాక్షి అమ్మవారు, ఆకుపచ్చ రంగుతో అలరారుచున్నారు అని  శ్యామలా దండకం ప్రవచనంలో చెప్పారు.



చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥



భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ।
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥



మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥



శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యాలోో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మతంగ ముని కుమార్తె)రాజ మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశ మహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే, తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్యను ప్రధానంగా శ్రీ ఆది శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది.



విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి లలిత సహస్ర నామంలో ప్రస్తావించబడినది. అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును, రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు..
శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.



మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే, త్వరగా అనుగ్రహిస్తుంది. గురు ముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.
శ్రీ కాళిదాసు రచించిన శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం ఈ శ్యామల దండకం.

Products related to this article

Shiva Bhagavan Idol ( God Shiva Brass Idol 3 inches)

Shiva Bhagavan Idol ( God Shiva Brass Idol 3 inches)

                                                        &nbs..

$9.72