తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి..............!!
( పుష్యమాసం శని ఆరాధన చాలా పవిత్రం )
తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం;
మొదటగా నల తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతో, మొదటిగా ధర్భేశ్వర స్వామి వారికి అభిషేకం తరవాత, ప్రాననాదీని అమ్మకి కుంకుమార్చన తర్వాత, శనీశ్వర స్వామి మూల మూర్తికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, గందోధక మహా అభిషేకం చేయించాలి. తర్వాత కాకులకు నువ్వులు కలిపిన అన్నం వేసి, తర్వాత మళ్ళీ నల తీర్థంలో స్నానం చేసి, మన ఒంటి మీద ఉన్న బట్టలు వదిలేయాలి. ఇది నియమం.
స్థల పురాణము
నల మహారాజుకు శని బాధలు తొలగిన ప్రదేశంలో, కొలువై ఉన్న శ్రీ శనైశ్చర స్వామి వారు.
పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి, అసమానమైన ప్రాముఖ్యత ఉంది.
ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం వుంది. శివుని అవతారమైన దర్భేశ్వర శనీశ్వర స్వామి
ఉన్న ఈ కోవెలలో, శనీశ్వరుడు, ఒక గోడ గూటిలో కొలువున్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు,
శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి, భక్తులు ఈ గుడిని దర్శించి, ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి,
ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే, శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు,
తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు, ఇక్కడి కొలనులో స్నానం చేసి, గుడిలో పూజ చేసిన తరువాత,
శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి, విముక్తి పొందినట్లుగా చెప్పబడింది.
శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?
నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు,
వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు, పావు లేదా అరలీటరు
నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.
Book Now Shani Trayodashi Special : https://www.epoojastore.com/pooja-services/pujas-and-abhishekalu/shani-trayodashi-special-shani-dosha-pujas-and-masa-shivatri-special-rudrabhishekam
కృష్ణ స్వరూపుడు, నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు, నల్లని ఇప్పపూవు వంటివాడైన, శనీశ్వరునికి నమస్కారం.
త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక
తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి, భర్త వద్ద వదిలి, తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి,
సూర్యభగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి
తిథియందు, ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు; వీరంతా శని మహిమ
వల్ల అనేక కష్టనష్టాలను పొంది, చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి
తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు.
ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు. అయితే
పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన, 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరునళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల
నల మహారాజు వస్త్రాలను, పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజును, శని విముక్తి
చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి, ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు
ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో, జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.
ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై, శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి,
మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు. శింగణాపూర్, మందపల్లి, నర్సింగ్, విజయవాడ, జాల్నా, పాపగడ్,
వైదీశ్వరన్ కోయిల్ లోని దేవాలయాలన్నీ, శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతి గాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో
మందపల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి, శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే, శని దేవుని వలన కలిగే
సమస్త దోషాలు నివారించబడతాయని, స్కంద పురాణంలో లిఖితమై ఉంది.