
20 ఫిబ్రవరి 2025 ️
కాలాష్టమి, శబరి జయంతి
గురువారం గ్రహ బలం పంచాంగం
గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం
"శ్రీ ఇంద్రుడు"
మరియు "శ్రీ దక్షిణామూర్తి".
గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం బృహస్పతయే నమః ||
2. ఓం ఇంద్రాయ నమః ||
3. ఓం దక్షిణామూర్తయే నమః ||
4. ఓం విష్ణవే నమః ||
5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ||
శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి.
గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి.
గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ధన నష్టం, మానసిక అశాంతి, విద్యా లోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతుంది.