దిన ఫలాలు 29-01-2024

దిన ఫలాలు 29-01-2024

మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి.


వృషభం: వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.


మిథునం: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం.


సింహం: ఆప్తుల సలహాలతో ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.


కన్య: ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంత వరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం.


తుల: ఋణ భారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంకి సంబంధించిన విద్యా, ఉద్యోగ విషయాలు చర్చించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది.


వృశ్చికం: వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెండింగ్ లో ఉన్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


ధనస్సు:  ఋణ బాధలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఇంటా బయట ఒకే రకమైన ధోరణి ఉంటుంది. సోదరుల నుండి ధనలాభం.


మకరం: ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభాలు ఉంటాయి. ఆర్ధిక పరంగా ఖర్చులు అధికం. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి.


కుంభం: ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూమిని కొనుగోలు చేసే విషయమై ఒక ఆలోచనకి వస్తారు.


మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాత, కొత్త మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఇంటా బయటా మీదే పై చేయిగా ఉంటుంది.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121