దిన ఫలాలు 28-09-2023

దిన ఫలాలు 28-09-2023

మేషం:  వివాదాలకు దూరంగా ఉండండి. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.


వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు పొందుతారు.


మిథునం: సంఘంలో గౌరవం పొందుతారు. సన్నిహితులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు.


కర్కాటకం: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బాకీలు వసూలు అవుతాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.


సింహం: సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. స్వల్పధన లాభం పొందుతారు.


కన్య: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విలువైన వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


తుల: ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి. వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు.


వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి.


ధనస్సు:  ఆదయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. వృత్తి - ఉద్యోగ,వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


మకరం: దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. పనులు నిదానంగా సాగుతాయి.రుణ బాధలు తప్పవు. దూర ప్రయాణాలు లాభిస్తాయి.


కుంభం: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధన లాభం.


మీనం: సంఘంలో విశేష గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభాలు పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు.


                                                                               

Rasi Phalalu - 2023-09-28 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121