దిన ఫలాలు 27-01-2024

దిన ఫలాలు 27-01-2024

మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్కలు ఎదురైన అధిగమిస్తారు.


వృషభం: మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తులాభ సూచన.


మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. పై అధికారులతో జాగ్రతగా ఉండడం మంచిది.


కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు.


సింహం: సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్ళు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్వల్ప ధన లాభం.


కన్య: వృత్తి-వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అధికారుల నుండి ఉద్యోగస్తులకి తీపికబురు అందుతుంది. సంతానంకు కార్యసిద్ధి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు.


తుల: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన చికాకులు, అడ్డంకులు తొలుగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.


వృశ్చికం: జీవిత భాగస్వామి నుండి ఆర్ధిక లాభం పొందుతారు. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన యోగం.


ధనస్సు:  సన్నిహితుల నుండి విలువైన నమాచారం అందుకొంటారు. బంధువుల నుండి కొన్ని విషయాలలో అధిక ఒత్తిడి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప ధనలాభం.


మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో లాభాల పంట. నూతన వాహన యోగం ఉన్నది.


కుంభం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి-వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.


మీనం: ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121