దిన ఫలాలు 27-09-2023

దిన ఫలాలు 27-09-2023

మేషం:  ఉత్సాహంగా పనులు చక చకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు.


మిథునం: పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కర్కాటకం: ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలకు పొందుతారు.


సింహం: నూతన పరిచయాలు వృద్ధి చెందుతాయి. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.


కన్య: వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.


తుల: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.


వృశ్చికం: ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము. వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. స్వల్ప ధన లాభం.


ధనస్సు:  దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.


మకరం: పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ, గృహాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి.


కుంభం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి - వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.అనుకొని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.


మీనం: చిన్ననాటి మిత్రుల నుండి వ్యాపారపరమైన విలువైన సమాచారం అందుకుంటారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ఆకస్మిక ధన లాభం పొందుతారు.


                                                                               

Rasi Phalalu - 2023-09-27 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121