దిన ఫలాలు 25-09-2023

దిన ఫలాలు 25-09-2023

మేషం: ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని నిర్ణయం తీసుకుంటారు.ముఖ్యమైన పనులలో అంతంత మాత్రమే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో విభేదాలు ఏర్పడతాయి.


వృషభం: జీవిత భాగస్వామితో కలహాల కాపురం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తున్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శక్తి వంచన లేకుండా చేసే ప్రయత్నం కార్యం సిద్ధింప చేస్తుంది.


మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగిన సకాలంలో పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. చేబదులు చేయాల్సిన పరిస్థితి.


కర్కాటకం: కుటుంబంలో కలహాలు సద్దుమగుతాయి. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. కార్యజయం లభిస్తుంది.


సింహం: సంతానం నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబంలో ఆనందోత్సవాలు నిండుకుంటాయి. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. చిన్ననాటి మిత్రులు కలయిక మానసిక ఆనందానికి కారణం అవుతుంది.


కన్య: రాబడి కి మించిన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు అరికట్టాలని ప్రయత్నించిన ఆగవు. వచ్చే దానికన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. శ్రమ తప్ప ఫలితం శూన్యం. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


తుల: ఇంటాబయటా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రుణ బాధలు చికాకులు పెట్టిన అధిగమించి ముందుకు సాగుతారు. నూతన గృహాలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు.


వృశ్చికం: నూతన కార్యక్రమాలు నిదానంగా సాగిన సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహంలో ఆనందం వెల్లువిరుస్తుంది.


ధనస్సు:  దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది.సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు.


మకరం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. అదృష్టం ఒక్కసారే వస్తుంది. బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.


కుంభం: ఉత్సాహంగా పనులు చక చక పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు. సొంత ఆలోచనలు శ్రేయస్కరం.


మీనం: దూరప్రాంతాల నుండి వచ్చిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

                                                                               

Rasi Phalalu - 2023-09-25 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121