దిన ఫలాలు 24-09-2023

దిన ఫలాలు 24-09-2023

మేషం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సొంత బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత ఒడిదుడుకులు ఎదురైనా నిలబడతారు.


వృషభం: ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప లాభాలు ఉంటాయి.


మిథునం: ఆరోగ్యపరంగా మెలకువ చాలా అవసరం. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కొన్ని విషయాలలో అప్రమత్తత చాలా అవసరం.


కర్కాటకం: కుటుంబంలో కొన్ని విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. సోదర సోదరీమణులను కలిసి సాధక బాధలు చర్చించుకుంటారు. ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు.


సింహం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి - వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.


కన్య: సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. స్వల్ప ధన లాభం. వివాహయత్నాలు ఫలిస్తాయి.


తుల: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ బాధలు తప్పవు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగిన నిదానంగా ఫలిస్తాయి.


వృశ్చికం: విద్యా, ఉద్యోగ అవకాశాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు, సంతానం లేని వారికి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మధ్యమ ఫలితాలు ఉంటాయి.


ధనస్సు:  రుణాలు తీరీ ఊరట చెందుతారు. గృహాలు, వాహనాలు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం పొందుతారు.వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.


మకరం: అనారోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు ముదిరి పాకాన పడతాయి. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. రాబోయే కాలం ఆశాజనకంగా ఉంటుంది.


కుంభం: బంధువులతో ఏర్పడిన ఆర్థిక వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేస్తారు.


మీనం: విందు వినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీలో దాగిన ప్రతిభకి మరింత పదును పెట్టి జీవితంలో ముందుకు సాగుతారు. రాబోయే కాలంలో ఆర్థిక అభివృద్ధికి ఇప్పటినుండి దారిని ఏర్పరచుకుంటారు.

                  

                                                                               

Rasi Phalalu - 2023-09-24 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121