దిన ఫలాలు 23-01-2024

దిన ఫలాలు 23-01-2024

మేషం:  రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రముఖుల కలయిక. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు.


వృషభం: వృత్తి, బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.


మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి ముఖ్యసమాచారం అందుతుంది. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.


కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారలు అభివృద్ధి చెందుతాయి. గృహ, వాహనాల కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.


సింహం: అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు.


కన్య: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. కుటుంబ సమస్యలు నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వస్తు సేకరణ.


తుల: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూమూల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు.


వృశ్చికం: కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు సేకరణ.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వాహనయోగం. వస్తులాభం.


మకరం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ఋణాలు కొంత వరకు తీరుస్తారు. శ్రమాధికం. పనులలో తొందరపాటు వద్దు. ఆస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.


కుంభం: నూతన మిత్రుల నుండి ముఖ్యసమాచారం అందుకుంటారు. వాహనయోగం. పనులలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.


మీనం: దూరప్రయాణాలు లాభిస్తాయి. పనులలో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరుల నుండి ధనలాభం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121