దిన ఫలాలు 18-01-2024

దిన ఫలాలు 18-01-2024

మేషం:  ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదురుల నుండి సహాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం.


వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును.


మిథునం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం.


కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం.మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు.వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.


సింహం: ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. దూరప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి.


కన్య: ఋణవత్తిడులు కొంత వరకు తీరుస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. జీవితభాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


తుల: పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.


వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధనలాభం.


ధనస్సు:  బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభం.


మకరం: ఋణాలు కొంత వరకు తీరుస్తారు. శ్రమాధికంగా వుండును. పనులలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం అందోళన పెడుతుంది. జీవిత భాగస్వామి నుండి సాయం అందును.


కుంభం: ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం నుండి ఆర్థిక లాభాలు పొందుతారు. శుభవార్తలు.


మీనం: మానసిక ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121