దిన ఫలాలు 17-10-2023

దిన ఫలాలు 17-10-2023

మేషం:  ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తుకొనుగోలు.


వృషభం: ప్రయాణాలు లాభసాటి ప్రోత్సాహకరంగా ఉంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.


మిథునం: స్వశక్తే మీకు బాసటగా ఉంటుంది. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.


కర్కాటకం: కుటుంబ సమస్యల నుండి బయట పడతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ద వద్దు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.


సింహం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంతానానికి సంబందించి తలపెట్టిన నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహన యోగం యోగిస్తుంది.


కన్య: వృత్తి - వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. పోరాడి మరీ కాంట్రాక్టులను దక్కించుకొంటారు. నిజాయితీకి తెగువ ఎక్కువ అని నిరూపిస్తారు. సోదరుల నుండి శుభ వార్తలు అందుతాయి.


తుల: సన్నిహితుల సహకారంతో అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ముఖ్యమైన ప్రయాణాలు రద్దు చేసుకొంటారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.


వృశ్చికం: కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక వనరులు సమతుల్యంగా ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.


ధనస్సు:  నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు.


మకరం: ఋణ బాధల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. పెట్టుబడులకి తగిన లాభాలు పొందుతారు. అధికశ్రమ మూలంగా శారీరక అలసట, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.


కుంభం: షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయటా అందరి మన్ననలు పొందుతారు. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహోపకరణాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.


మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవ చింతన ఎక్కువ అవుతుంది. విద్యార్ధులకి సంకేతిక విద్యావకాశాలు మెండుగా ఉంటాయి. వారి భవిష్యత్తు కోసం ఇప్పటినుండే ప్రణాళికలు రూపుదిద్దుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121