దిన ఫలాలు 03-02-2024

దిన ఫలాలు 03-02-2024

మేషం:  దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం.


వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. పెట్టుబడులకు అనుకూలం.


మిథునం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ రంగాలలో ఉన్న వారికి అనుకూలం.


కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరు స్తాయి. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు.


సింహం: కృషి ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్వల్ప ధనలాభం.


కన్య: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన పనులో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు.


తుల: దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం.


వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


ధనస్సు:  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.


మకరం: రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. సోదరుల నుండి వచ్చిన సమాచారం ద్వారా ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.


కుంభం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయాల్లో జాగ్రత్తలు అవసరం.


మీనం: చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121