వార ఫలాలు 17-09-2023 నుండి 23-09-2023 వరకు

వార ఫలాలు 17-09-2023 నుండి 23-09-2023 వరకు

మేషం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా బంధువర్గములో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది.  శత్రువర్గం వారుకూడా అభినదించేలా నలుగురిలో గుర్తింపబడతారు. వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన సమయం. వ్యవసాయ పరంగా కొత్త పనులు ప్రారంభించడానికి, అలాగే నూతన యంత్రాంగములు కొనుగోలు చేయడం వంటివి మంచిది. 

ఉద్యోగస్తులకు ఈవారం అన్ని విధాలుగా బాగుంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. తలపెట్టిన పనులను ద్విగిజయంగా పూర్తి చేస్తారు. అయితే మీ ముక్కు సూటితనం వల్ల కొన్ని ఇబ్బందులు వుండే అవకాశాలు సూచిస్తుంన్నాయి జాగర్త వహించడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి, నిత్యం స్వామి వారికీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. 

వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ రంగం వారికీ కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. భూములు కొనుగోలు చేసేటపుడు అన్ని పత్రాలను పరిశీలంచడం చెప్పదగిన సూచన.  కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్ధికంగా ఆరోగ్య పరంగా బాగుంటుంది. కొద్దిపాటి అలసట, నీరసం వంటివి ఉంటాయి.  విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు మంచిది. నూతన విద్య, ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి. 


వృషభం: ఉద్యోగస్తులకు,  వ్యాపారస్తులకు ఈవారం సానుకూలంగా యధావిధిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీరు సాఫీగా ఉన్నప్పటికీ శత్రువర్గము నుండి ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కుటుంబము నందు కూడా చిన్నపాటి మాటపట్టింపులు కానీ, కుటుంబంలో వారి అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని అశాంతికి గురిచేస్తాయి.  

కోపమును నియంత్రించుకోవడం మంచిదని సూచన. అయితే స్నేహవర్గం సహాయ సహకారములతో కొంత ఊరట చెందడం అనేది జరుగుతుంది. బయట మీ గౌరవం వృద్ధి అవ్వడం, మీ యొక్క మాటకు విలువ పెరగడం జరుగుతుంది. ఎవరో ఎదో అన్నదానికి, విమర్శలకు కృంగిపోవద్దు. అది మీమీద ఉన్న ఈర్ష్య, అసూయలతో మాత్రమే మాట్లాడే మాటలు అని గ్రహించండి. కృషితో పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్య పరంగా శారీరక సమస్యల కంటే చిన్న పాటి మానసిక ఆందోళనలు, టెన్సన్స్ వంటి ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడకండి. 

వారం ప్రథమార్ధం లో మొదలు పెట్టిన పనులు ద్వితీయార్థంలో మంచి అనుకూలమైన శుభ ఫలితములను ఇస్తాయి. కళాకారులకు, సినిమా రంగం వారికి మంచి అనుకూలమైన సమయం.విద్యార్థిని విద్యార్థులకు కొంత టెన్సన్స్, ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మంచి స్నేహము జీవితానికి మంచి పునాది ఈవిషయం గుర్తు ఉంచుకోండి.


మిథునం: ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి.  మీరు ఉద్యోగ పరమైన పనులను, విధినిర్వహణాలను నిర్లక్ష్యం చేయకుండా నిర్వర్తించడం చెప్పదగిన సూచన. ఇప్పుడు మీరు చిన్న పొరపాటు చేస్తే మీ పైఅధికారులు కానీ, సహా ఉద్యోగాస్తులు కానీ అది ఆసరాగా తీసుకుని మీమీద బురద చల్లే అవకాశములు ఉన్నాయి. కాబట్టి వృత్తి, ఉద్యోగములు యందు జాగ్రత్త వహించండి. 

వ్యాపారస్తులకు లాభముల విషయంలో యధావిధిగా ఉంటుంది. అంతర్గత  విమర్శలు తప్పవు. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని తెలుసుకుంటారు. 

బంధువర్గంలో, స్నేహవర్గంలో కూడా మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. అయితే  జీవిత  భాగస్వామి, కుటుంబం నుండి ఆదరణ, సౌఖ్యం లభిస్తుంది. శ్రేయోభిలాషుల, పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించండి. కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆహారం విషయంలో శ్రద్ద వహించండి. కొంత సమయం విశ్రాంతికి కేటాయించండి. 

విద్యార్థిని విద్యార్థులకు ఈవారం ఆటలు, కల్చురల్ యాక్టివిటీస్ లలో మంచి విజయములు ఉండే అవకాశములు ఉన్నాయి.  


కర్కాటకం: ఉద్యోగ పరంగా,  వ్యాపారపరంగా కూడా అభివృద్ధి కనబడుతుంది. ఆర్ధిక లాభములు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబములో, స్నేహవర్గంలో కూడా సానుకూలత  ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. 

పాత సమస్యలను, పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త వ్యవహారములు, ప్రణాళికలు వంటివి మొదలు పెట్టడం అంత మంచిది  కాదు. కొంత నిదానాన్ని  ఏర్పరచుకోండి.  అర్ధాష్టమ శని నడుస్తున్నది వలన , 8  శని వారలు శని కి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన

మాట్లాడేటప్పుడు జాగర్త అవసరం. మీరు మాట్లాడేది ఒకటి, ఎదుటివారికి అర్ధమయేది ఇంకోలా ఉంటుంది. తద్వారా ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ చిన్నపాటి అవమానములు, అపవాదులు ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు పట్టించుకోకుండా ముందుకు సాగండి.  శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. గతంలో ఉండే చిన్నపాటి ఇబ్బందులు తగ్గుతాయి. 

అయితే ప్రయాణములలో, వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు  అన్ని విధముల మంచి అనుకూలమైన సమయం.  అనుకున్న ఉత్తీర్ణత సాధించగలుగుఫుతారు. పట్టుదలతో ముందుకు సాగండి. 


సింహం: ఉద్యోగస్తులకు అధికారులనుండి ఒత్తిడి, అనుకున్న ఫలితములు ఆలస్యం అవ్వడం వంటి ఇబ్బందులు కలిగే అవకాశములు ఉన్నాయి. 

వ్యాపారస్తులకు లాభములు తక్కువగా ఉండడం లేదా కొద్దిపాటి నష్టములు చవిచూసే అవకాశములు ఉన్నాయి. కొద్దిపాటి టెన్షన్స్ ఉంటాయి, పట్టుదల కు పోవడం మంచిది కాదు.   మాటల  కారణంగా  శత్రువర్గం ఎక్కువ అయ్యే అవకాశములు ఉన్నాయి. మాటలు కఠినంగా మాట్లాడడం మంచిదికాదు. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి.   జాగ్రత్త వహించండి.   

అనాలోచిత ఖర్చులు ఉంటాయి. స్నేహితుల విషయంలో, కొత్తగా పరిచయమైన స్నేహాలు విషయంలో జాగ్రత్త వహించండి.  హామీలు, సంతకాలు వంటివి చేయవద్దు. మోసపోయే అవకాశములు ఉన్నాయి.  

ఎంత ఆందోళనలు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరుతుంది, కొంత ఆలస్యంగా అయినా అనుకున్న పనులు నెరవేరుతాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. పట్టుదలతో ముందుకు సాగండి.  విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయం, కష్టపడి చదివితే అనుకూల ఫలితములు వస్తాయి.


కన్య: ఉద్యోగస్తులకు పైఅధికారులతో ప్రతికూల ఫలితాలు, మానసిక ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కష్టపడ్డాము కదా ఫలితాలు రాకపోగా ఈ అపవాదులు ఏమిటి అన్న మీ మనస్సు మనో వేదనకు గురుఅవుతారు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం పరంగా కాంత జాగ్రత్త అవసరం.    

వ్యాపార వ్యవహారములు యందు నిరాదరణ, ఆలస్య ఫలితాలు ఉండే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.  

మాట విషయంలో మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. బయట ఉండే సమస్యలు, చికాకులు కుటుంబంలో అశాంతికి కారణం అవుతాయి. కొంత ఆలోచించి ప్రశాంతముగా మాట్లాడండి. 

స్నేహితులతో అనుకూలత ఉంటుంది. ఆర్ధిక పరంగా అవసరముల మేరకు ధనం చేతికి అందుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదివితే ఫలితములు బాగుంటాయి. అశ్రద్ధ వహించకండి. 


తుల: ఈ వారం ప్రథమార్ధం కంటే, ద్వితీయార్థం లో మంచి అనుకూలమైన ఫలితములు , అనుకోని  అదృష్టం  వంటివి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి, వర్క్ ప్రెషర్ వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. 

అనుకున్న సమయానికి పనులు చేసుకోండి. నిర్లక్ష్యం పనికి రాదు. అనాలోచితంగా, మీరు అనుకోని విధంగా ఖర్చులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే ఖర్చులకు వెనకాడకుండా ఖర్చు చేస్తారు. సంతాన పరంగా  సంతోషం, గౌరవం, తృప్తి లభిస్తాయి. స్నేహవర్గంతో సానుకూలత ఉంటుంది. 

సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  చిన్న  పాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటివి  వచ్చే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.  

యువతీయువకులు విలాసములు, వ్యసనముల  విషయంలో జాగ్రత్త  వహించండి.  సరదాగా చేసే పనులు భవిష్యత్తులో అలవాటుగా, వ్యసనములా మారె అవకాశములు ఉన్నాయి. విద్యార్థినివిద్యార్థులకు తెలివితేటలకు పరీక్షా సమయంగా చెప్పవచ్చు.  ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం మంచిది.


వృశ్చికం: ఉద్యోగస్తులకు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అధికారులతో సానుకూలత, అభివృద్ధి  ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు సైతం  ఆర్ధిక పరమైన లాభములు అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. 

స్థిరాస్తుల విషయంలో ఆలోచనలు కొలిక్కి వస్తాయి. సర్వత్రా కొత్త పనులు ప్రారంభించుటకుమంచి సమయం.  సంతాన పరంగా సంతోష కరమైన వార్తలు వినే  అవకాశములు ఉన్నాయి. సంతానము  అభివృద్ధి ఉంటుంది.  స్నేహ వర్గము, కుటుంబ పరంగా కూడా  అనుకూలత ఉంటుంది. మీ యొక్క ఓర్పు సహనం వలన మంచి పేరు సంపాదిస్తారు. 

అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్త వహించండి. వాహనములు,  ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించండి. అర్ధాష్టమ శని నడుస్తున్నది వలన , 8  శని వారలు శని కి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన

కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఉద్యోగావకాశములు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలు, అదృష్టం కారణంగా చేసే పని యందు అభివృద్ధి ఉంటుంది.  విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల యందు అనుకూలమైన ఫలితములు ఉంటాయి. పెద్దల సహాయ సహకారములు మీకు ఎల్లపుడు ఉంటాయి.   


ధనస్సు: ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉంటుంది. అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు క్రమక్రమాభివృద్ది ఏర్పడుతుంది. గతంలో కంటే కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి.  ఆర్ధికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. అయితే కొంత మీ నిర్లక్ష్య ధోరణి వలన కూడా చిన్న పాటి మాట పట్టింపులు, అదే ఆసరాగా తీసుకుని శత్రువులు అనుకునేవారు మీమ్మల్ని  ఇబ్బంది పెట్టడం వంటి జరుగవచ్చు. జాగ్రత్త వహించండి.  

కొత్త పనులకు కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ పనులు తొందరగా పూర్తవుతాయి. వారం ప్రథమార్ధం, ద్వితీయార్థం లో  అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నెరవేరవుతాయి. 

కుటుంబంలో, స్నేహితులతో ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ధైర్యంతో చిన్నపాటి అనారోగ్య సమస్యలను పట్టించుకోరు.  కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకున్నంత జీతంతో ఉద్యోగం రాకపోవచ్చు, కానీ ప్రయత్నములు ఫలిస్తాయి. ముందుకు సాగండి. భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. బద్ధకం వదిలి పెట్టండి. అనుకున్న ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి.


మకరం: ఏలినాటి  శని నడుస్తున్నది వలన , 8  శని వారలు శని కి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన.

ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా నష్టములు లేనప్పటికీ తక్కువ లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. అదే ఉద్యోగ వ్యాపారములలో ఎదుటివారికి ఉన్నంత అభివృద్ధి మనకు లేదు అనే ఆందోళన కలుగుతుంది. అయితే అవసరముల మేరకు లోటు ఉండదు. 

కానీ తెలియని అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. మాటలో లోపం కానీ, తప్పులు వెతికే అవకాశములు ఉన్నాయి. ప్రయాణములు, బంధువర్గం వలన ఖర్చులు అధికంగా ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీయొక్క మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంపాదన ఎంత ఉన్నప్పటికీ చేతిలో ఎంత ఉంటె అంత ఖర్చు అయిపోతుంది. భవిష్యత్తు ప్రణాళికలకు ఆలోచిస్తారు. పనులు నిదానంగా అవుతాయి. 

వారం ద్వితీయార్థం లో కొంత అనుకూలమైన ఫలితములు ఉంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణములలో, వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన. విధ్యార్ధిని విద్యార్థులకు  కొద్దిపాటి టెన్సన్స్ ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో రాణిస్తారు. మీకు పరీక్షా సమయంగా చెప్పవచ్చు.  


కుంభం: ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడిలు, ఉద్యోగంలో మార్పుల కోసం ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడి నిర్ణయములు తీసుకోకండి.  కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రయత్నములు ఫలించినప్పటికీ  ఆర్ధికంగా అనుకున్న అభివృద్ధి ఉండకపోవడం మానసిక అసంతృప్తిని కలుగచేస్తుంది.  తొందరపడి ఉద్యోగంలో మార్పులు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కాబట్టి కొంత ఓర్పు, సహనం వహించండి.

కుటుంబ సభ్యులతో విబేధాలు వచ్చే అవకాశాలు వున్నాయి, మీ మాటకి విలువ తగ్గుతుంది. మీ కంటే కింది స్థాయి వాళ్ళు సలహాలు ఇస్తున్నారు అన్న భాద కలచివేస్తుంది. ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్త వహించాల్సిన సమయం. పాత అనారోగ్య సమస్యలు, దీర్ఘ కాలిక వ్యాధులు వంటి వాటిని అశ్రద్ధ చేయవద్దు. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. 

కొత్తగా ఋణములు, లోన్లు వంటివి తీసుకోవడం మంచిది కాదు. ఇతరుల వ్యవహారములలో తల దూర్చడం వంటివి కూడా మంచిది కాదు. మంచికి వెళ్తే చెడు ఎదురయినట్టు జరుగవచ్చు.  వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో వున్న పనులు ప్రారంభ మవుతాయి. పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఈ వరం వచ్చే అవకాశం వుంది. కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్స్ కానీ నిర్మాణం కానీ ఇది మంచి సమయం కాదు అని చెప్పవచ్చు. 


మీనం: ఉద్యోగస్తులకు, సాధారణంగా, సామాన్యంగా గోచరిస్తుంది. లాభనష్టములు వంటివి కాకుండా సానుకూలంగా ఉంటుంది. అయితే  కొత్తపనులు, ప్రణాళికలు అమలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ప్రశంసలు అందుకుంటారు.  అయితే ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉంటుంది. డబ్బుకంటే హోదాకు, పేరుకు ప్రాధాన్యత ఇస్తారు. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు అభివృద్ధి ఏర్పడే అవకాశములు ఉన్నాయి. అయితే ఒకపనికి రెండు పనులన్నట్టు ప్రతీ పనికి ఎక్కువ ప్రయాస ఉండే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. స్నేహితుల అండదండలు అండదండలు లభిస్తాయి. 

వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టే పనులలో పురోగతి కనిపిస్తోంది. మనం బాగుండాలి అందరు బాగుండాలి అనే భావన అందరికి అర్థం కాదు. మీ విలువని ఎప్పటికి అర్థం చేసుకోలేరు. అన్ని వున్నా మనల్ని అర్థం చేసుకునే మనిషి లేరే అని మనోవేదనకు గురిఅవుతారు. వ్యాపారంలో ఆటు-పోట్లు తప్పవు అని తెలిసి ముందుకు సాగరుతారు. అది మంచి ఫలితాలనిస్తాయి. ద్వితీయార్థం లో రావలసిన ధనం అందుతుంది.  

కుటుంబలో చిన్న పాటి కలహములు ఉండే అవకాశములు ఉన్నాయి. వృధా ప్రయాణములు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. అత్యవసరమైతే తప్ప ప్రయాణములు అంత మంచిది కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వారం ద్వితీయార్థం లో  అనుకూల  ఫలితములు ఉండే   అవకాశములు ఉన్నాయి.  విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. మీ కష్టమును బట్టి ఫలితములు ఉంటాయి. అదృష్టం కంటే కష్టమును, పట్టుదలను బట్టి ఫలితాలుండవచు. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి  పట్టుదలతో చదివితే అనుకూలమైన ఫలితములు ఉంటాయి. 


                                                Weekly Rasi Phalalu - Sep 17th - Sep 23rd 2023 | వార ఫలాలు - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121