వార ఫలాలు 04-02-2024 నుండి 10-02-2024 వరకు

వార ఫలాలు 04-02-2024 నుండి 10-02-2024 వరకు

మేషం: వారికి  అన్ని విధాల మంచి అనుకూలమైన  ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, మంచి వాతావరణం నెలకొంటుంది. మీ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంటుంది. ఇతరులకి ఇచ్చిన డబ్బులు చిక్కునబడతాయి అని భావిస్తారు, తిరిగి అవి మీకు వస్తాయి. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. చిరకాల మిత్రులని కలుసుకుంటారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా వుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు గడిస్తారు. సాఫ్ట్ వేర్ రంగంలో,  ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా నాలుగు మెట్లు ఎక్కుతారు. వ్యాపారంలో ఖర్చు పెట్టినప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య రంగంలో, సినీ రంగంలో వున్న వారికీ మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన  ఉద్యోగ  ప్రయత్నాలు చేసే వారికి, విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ స్థానం చలనం కొరకు ఎదురు చూసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చిన్న విషయాన్నీ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. 

వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం, గృహ నిర్మాణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, అన్నప్రాసన ఇవన్నీ  కూడా విధి విధానాన్నికి కొన్ని తేదీలను నిర్ణయంచుకుంటారు. విద్య కొరకు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వారికి కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.  పిల్లల ఆరోగ్య విషయంలో జాగర్త వహించాలి, మంచి చదువు మంచి వుద్యోగం కావాలంటే   మనోధైర్యం కృషి, పట్టుదల కావాలి, మేధాదక్షిణామూర్తి ధరించండి మంచి ఫలితాలుంటాయి. కళా, రాజకీయ వేత్తల కృషి ఫలిస్తుంది. తగిన ఆదరణ లభిస్తుంది. సంఘంలో స్థాయి, పలుకుబడి పెరుగుతాయి. వాటిని కాపాడుకోవడంలో నిమగ్నమవుతారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత కష్టపడితే అంత ఫలితం అన్న మాట. కుటుంబంలో చిన్నపాటి ఒడిదొడుకులు సహజం, వాటికీ భయపడి వెనకడుగు వేయకండి, ఎన్ని అవమానాల ఎదురైనా ముందుకు సాగండి. కష్టపడేవాళ్ళకి కష్టం ఎక్కువ అయినా విజయం మీదే అవుతుంది. కుటుంబ సౌఖ్యం ముఖ్యమని భావించండి. కొంత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.


వృషభం: వారికి ఈవారం కొంత జాగ్రత్త పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, ప్రయాణములు మంచిది కాదు. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఈవారం. చేయని తప్పుకు నిందపడవల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఎదో తెలియని బాధ మిమల్ని వెంటాడుతుంది. విదేశీయాన ప్రయాణాలు ఫలిస్తాయి, విదేశాల్లో ఉంటున్న వారికీ వుద్యోగం  లభిస్తుంది. ఎక్కడైనా పోటీ అనేదే ఉంటది దానిని దాటుకుని వస్తారు.  మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు అలాగే కష్టపడతారు. ఎంత కష్ట పడ్డ ఒక్కోసారి ఈ జీవితం ఇంతేనా అని బాధపడతారు. మీరు బాగుంటే ఓర్వలేని వారు మీరు కష్టంలో ఉంటే సంతోషిస్తారు. ఏది ఏమైనా భగవతుంది మీద భారం వేసి ముందుకు సాగండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి, మీకు ఒక రోజు వస్తుంది అని మరవకండి. ఓర్పు సహనం వహించండి. వ్యాపారస్తులకు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మిశ్రమ ఫలితాలతో నెట్టుకొస్తారు. 

కొత్త ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తుతాయి. రావాల్సిన మొండి బాకీలు రాక ఇబ్బంది పెడతాయి. ఎన్ని సంత్సరాలు కష్టపడ్డా ఫలితం సూన్యం అనే భావనకు వస్తారు. సొమ్మొక్కడది సోకొకడిది అన్నటుగా ఉంటుంది. పెట్టుబడి పేట్టి లాభాలు కోసం పార్టనర్ అని అడిగితె ఏమో నష్టాలు వస్తున్నాయి అంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కూడం పాపమే అవుతుంది. చూసేవాళ్ళకి వాడికేవిటమ్మ బాగా వ్యాపారం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు అనుకుంటారు కానీ దాని లోటుపాట్లు పడ్డవారికి తప్ప ఎవరికీ అర్థం కాదు. కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టివి, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి, వారం చివరిలో  కృషి ఫలించే సూచనలు వున్నాయి. ఏది ఏమైనా మనవారు ఎవరో పరాయివారు ఎవరో చూసుకుని వెళ్ళండి లేకపోతె మనుగడకే ఇబ్బంది రావచ్చు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. విందువినోదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. శారీరక శ్రమకి తోడు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థిని విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. మీరు అవలంబించే కార్యాచరణలు మీభవిష్యత్తుకి పునాది అని తెలుసుకోండి.


మిథునం: వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  మీ తెలివి తేటలతో, విచక్షణతో సమస్యలను అధిగమిస్తారు. ఏ విషయంలో అయిన ఒకటికి రెండు సారులు చెక్ చేసుకొని పరిస్తితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ చిక్కులు వస్తాయి, కొన్ని తొందరపాటు నిర్ణయాలు వాళ్ళ ఇబ్బంది రావచ్చు. మీరు ఒకటి అంటే వాళ్ళు ఇంకొకటి అనడం ఆలా పెరిగి గొడవలకు దారితీయవచ్చు. కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు కాస్త ఓర్పు, సహనం వహించడం మంచిది. మీ పని మీరు కరెక్టుగా చేద్దాము అనుకున్న అది సాగదు, ఎదో అడ్డంకు వస్తుంది, ఈ కంపెనీ లో పని చేయలేము మానేద్దాము అనుకుంటారు ఇది కొంత మంది విషయంలో మాత్రమే,  ఏ కంపెనీ అయినా పాలిటిక్స్ ఉంటాయి అని మరచిపోవద్దు. మీ యొక్క ప్రవర్తన నడవడికలు మిమ్మల్ని సమస్యల నుండి అధిగమించేలా చేస్తుంది. ఫైనాన్స్ విషయంలో ఒడిడుకులు గోచరిస్తున్నహైయి, అప్పు ఇచ్చి విరోధం అవుతారు, శుభకార్యాల కోసం మీరు దాచిపెట్టిన డబ్బుని వేరేవాళ్లకు అత్యవసరంగా ఇవ్వడం వలన ఇప్పుడు మీకు ఇబ్బడి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికి సహసకృత్యాలు పనికిరావు,  భవిషత్తులో చాల క్రమశిక్షణతో ఉండాలి, జాగర్త వహించాలి, డబ్బులు దగ్గర, వ్యవహారం దగ్గర బంధుత్వాలు  పనికిరాదు. కచ్చితంగా ప్రవర్తించాలి. అని మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. 

వ్యాపారస్తులకు కొంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం. ఈ పోటీ ప్రపంచంలో లాభాలకంటే ప్రచారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసిన వస్తోంది అని బాధపడతారు. రాబోయే రోజుల్లో స్తిరత్వం పొందాలంటే పోటీలో మనమున్నామని ప్రచార సాధనాలతో, సంకేతిక పరంగా నలుగురికి తెలియచేసేలా ఉండాలి, కానీ అది ఒక్కటే కాదు మన వ్యాపారం నమ్మకం చాల ముఖ్యం. బ్రాండ్ ఇమేజ్ అనేది చాల ముఖ్యం. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటారు, దానికి మీ భాగస్వామిని పంపిస్తారు అవి నమ మాత్రంగానే ఫలిస్టయి. సంతాన పరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.  సంతాన పురోగాభివృద్ది కొరకు శ్రమిస్తారు. ఎదో ఒకరకంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుంటారు. వారి ఆరోగ్య పరంగా కూడా ఖర్చులు ఉండే అవకాశములు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సారించడానికి ప్రయత్నిస్తారు, మీరు అనుకున్న గమ్యం చేరాలంటే కఠోర సాధన ఎంతైనా అవసరం. మీ సాధనే మిమ్మల్ని సాధించే దిశగా నడిపిస్తుంది. ఆర్ధికపరంగా అనుకున్నంత కాకున్నా ఈ రోజుకి ఇలా సాగింది అనుకుంటారు,  సమయానికి ఎదో ఒక రూపేణ ధనం చేతికి అందుతుంది.


కర్కాటకం: వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు తక్కువ అవ్వడం వంటివి ఉంటాయి, అయితే ఏది ఏమైనప్పటికీ పెట్టుబడులు అధికమవుతాయి. రాబడి తక్కువ అవుతుంది. కొంత ఋణ బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తోంది ఈ రాసి వారికీ, 8 శని వారలు శనికి తైలాభిషేకం చేయించండి, మనో ధైర్యం పెంచుకోవాలి, ఆశించని ఫలితాలు త్వరగా రావు, మీ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. పనిలో వత్తిడి వున్నా జాప్యం చేయకుండా ముందుకు సాగాలి, ఋణ వత్తిడి ఎక్కువగా ఉంటుంది, అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. సంతానం పట్ల జాగర్త వహించాలి. 

వివాహం కానీ వారికీ దగ్గర దాక వచ్చి వెళ్లిపోతాయి, అబ్బాయి కి నచ్చితే అమ్మాయికి నచ్చదు, అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు, ఇద్దరికీ నచ్చితే జాతకాలు బాగాలేదు అని దూరంగా వెళ్లిపోతాయి. ఈ విపత్కర పరిస్థితిల్లో వివాహం ఎలా చేయాలా అని అనుకుంటారు, అయితే భగవంతుని ఆశీసులతో మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని  విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు, పరీక్షలలో మంచి మార్కులకు బాగా చదవాలి, మీ యొక్క తెలివి తేటలుకు పదును పెట్టండి. కుటుంబంలో కానీ, పని చేసే సంస్థలో కానీ కొంత అవమానాలు, నిందారోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్యా ద్వేషం, అసూయలు ఉన్నవారే తప్పా మీరంటే ఏంటో తెలిసిన వారు మీ వెంటే ఉంటారు.  


సింహం: వారికి ఈవారం అన్ని విధాల మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అధికారులతో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉద్యోగంలో కానీ, పనిచేసే కార్యాలయాలలో ఏదైనా అడ్డంకులు, సమస్యలు ఉన్నట్లైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  వ్యాపారస్తులకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఆర్ధిక లాభాలు సామాన్యంగా ఉన్నప్పటికీ ప్రచారం వలన ప్రజాదరణ ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వారం ప్రథమార్థంలో కొంత స్వల్ప  ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ  సావకాశంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే వ్యాపారంలో కొంత మెళుకువలు నేర్చుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు లాభించవు.  కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఏర్పడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే సమయం అని చెప్పవచ్చు. ఏదైనా కొత్త  ఆలోచనలకు,  మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకునే సమయం గా చెప్పవచ్చు. 

వివాహం నిశ్చియించే ముందు ఒకటికి నాలుగు సార్లు సరి చూసుకొని ముందుకు సాగండి. వధూవరుల పొంతన తప్పని సరిగా నిశితంగా పరిశీలించుకోవడం మంచిదని చెప్పదగిన సూచన. పాస్ పోర్ట్ తీసుకునే వారికి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాలలో విద్యను అభ్యసించే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు. మానసిక ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగండి. పరీక్షలు సరిగ్గా రాయలేమేమో అన్న భావన పక్కనపెట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళండి, విజయం సిద్ధిస్తుంది. పిల్లలకు తల్లితండ్రుల సహకారం ఎంతో ముఖ్యం. గతంలో మీరు చేసిన సహాయ సహకారాల వలన ప్రస్తుతం మీరు శుభఫలితాలు అందుకుంటారు. మీయొక్క నైతిక విలువల వలన సోదర,సోదరీ వర్గంతో సఖ్యత లోపించే ప్రమాదం పొంచి ఉన్నది. రాజకీయపరమైన విషయాలలో మీ ఆలోచనలు తలక్రిందులు అవుతాయి. రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. 


కన్య: వారికి  సాధారణ  ఫలితాలు గోచరిస్తున్నాయి.  పని చేసే చోట కార్యాలయాలలో అపకీర్తి కానీ, ఉన్నత స్థితి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.  పనిచేసే చోట అనవసరపు వ్యయ ప్రయాసలు  అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త  వహించండి. వ్యాపారస్తులకు అంతంత మాత్రం అని చెప్పవచ్చు. శత్రువర్గం ఉన్నట్లైతే వారి నుండి విమర్శలు, అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతన ప్రణాళికలు విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించడం అంత మంచిది కాదు. మీ మీద బురద జల్లేవారు వున్నారు,  లేనిపోని నిందలు పడవలసి వస్తుంది, ముఖ్యమైన వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకోవం మంచిది, గోచార రీత్యా అష్టమ గురువు వలన ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోకపోతే నష్టపోయే అవకాశం వుంది. బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ఉండడం మంచిది. 

కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది, కుమారులతో కానీ కుటుంబ ముఖ్య సభ్యులతో అభిప్రాయ భేదాలు  ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాట పట్టింపులు పోకుండా ముందుకు సాగండి,  ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం ముఖ్యం ఈవారం.  ఇల్లు అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కొంత ఓర్పు సహనంతో మెలగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ సమస్యలు  వచ్చినప్పటికి స్నేహ వర్గం సహాయ సహకారములు అందుతాయి. వారి సలహాలు సంప్రదింపులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మానసిక ప్రశాంతత కొరకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాల  పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరియైన సమయం అని చెప్పవచ్చును. ఆధ్యాత్మికంగా మునుముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది. విద్యార్థులకు పట్టుదలతో , కృషితో ముందుకు సాగవలసిన సమయం గా చెప్పవచ్చు. విద్యాది కార్యక్రమాలలో అశ్రద్ధ వహించడం మచిది కాదు. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్ధులు కష్టేఫలి అన్నట్టు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. 


తుల: వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఉన్నట్లైతే తొందరపడటం మంచిది. వాయిదాలు మంచిది కాదు. వారం ప్రదార్థంలో ఫలితాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. ఆర్ధికాభివృద్ది ఉంటుంది.  పని చేసే చోట  సామాన్యంగా, యధాతధంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రశాంత వతరరణం ఏర్పడుతుంది. ఎంత వరకు చెయ్యాలో అంతే చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సాఫ్ట్ వేర్ రంగంలో ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం లభిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త వింటారు. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు, ఈరోజు బాగున్నాము మనము ఎలా మాట్లాడిన చెల్లుతుంది అనే భావనకు వస్తారు, ఈరోజు మీదవచ్చు కానీ వేరేవాళ్లకు ఒక రోజు వస్తుంది కాబట్టి అందరితో కలుపుకుని వెళ్లడం మంచిది.

వ్యాపారస్తులకు ఖర్చులు అధికం అవుతాయి. అయినప్పటికీ ఆర్థికస్థితి విషయంలో లోటు ఉండదు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో గాని మార్పులు చేయడానికి, ఉన్నత స్తితి చేరడానికి చేసే ప్రయత్నాలకి నాంది పలుకుతారు. అవి భవిష్యత్తులో బాగుంటాయి. మీకు భజన చేసేవారు వుంటారు, వారి విషయంలో జాగర్తగా ఉండాలి, అందలం ఎక్కించి దించుతారు. వారి పట్ల అతి జాగర్తగా ఉండాలి. అలాగే ఆర్ధిక పరంగా ఖర్చులు అధికం అవ్వడం వలన కొంత ఆందోళన చెందే అవకాశములు ఉన్నాయి. లోన్లు, ఋణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా కూడా మంచి సానుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క గౌరవం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. సమయం లేకున్నా ఎదో విధంగా మానసిక ప్రశాంతతకై కొంత సమయం కేటాయించండి. తద్వారా మీరు తపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా సాగడానికి దోహదపడుతుంది. నూతన గృహం తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కలను సహకారం చేసుకోవడానికి ఆప్తులతో సంప్రదింపులు చేస్తారు. వారి ఆలోచనలు కొంత వరకు మీకు ఉపయోగపడతాయి. కానీ ఆచరణలోకి రావడానికి సమయం తీసుకుంటారు. విద్యార్థులు చదువు మీద స్ట్రెస్ కు గురికాకవద్దు,  చదువే అన్నిటికి మూలం అనుకుంటారు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం, దైవ దర్శనాలు చేసుకోవడం వలన గురువు అనుగ్రహం లభిస్తుంది.


వృశ్చికం: వారికీ ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అనుకోని విధంగా ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు వెలువడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా అభివృద్ధి కంటే ఉద్యోగంలో కొంత  హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు చేయండి. సంతాన పరంగా కూడా మంచి వార్తలు వినడం జరుగుతుంది. వారి అభివృద్ధి సంతోషాన్ని కలుగ చేస్తుంది. అయితే బంధువర్గంలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన వాటిని దృష్టిలో ఉంచుకుని మీ మీద కొంత ఈర్ష్యా అసూయలతో మాట్లాడే వారి వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎంత నిదానంగా, ఓర్పుతో ఉంటె అంత మంచిది. వ్యక్తిగతంగా శుభకార్యాలు జరుపుకుంటారు. 

వ్యాపారస్తులకు కూడా ఆర్ధిక లాభాలు ఉంటాయి. సంపాదనంతా కుటుంబం కొరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. అనుకోని విధంగా బహుమానాలు, నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. ఆకస్మికంగా వస్తుసామగ్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత సంపాదించినప్పటికీ ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పని ఎక్కువ అవ్వడం వలన అలసట ఏర్పడుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి  తీసుకోవడం మంచిది. విద్యార్థులకు  కూడా కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మంచి ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి సన్నిహితులు కూడా ముక్కున వేలు వేసుకునే విధంగా మీ ప్రతిభని ప్రదర్శిస్తారు. రాజకీయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిసుతున్నాయి. క్రింది స్తాయివారి అండదండలు మెండుగా ఉన్నా కూడా మీ మీద దృష్పచారం చేసే వారి వలన కొంత నష్టం వాటిల్లుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నేలకుంటుంది. కుటుంబ సభ్యలు, సన్నిహితులు మీకు సహాయసహకారాలు అందిస్తారు. మనోధైర్యాన్ని అందించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు.


ధనస్సు: వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి ఇబ్బందులతో, కార్యానుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో నూతన శుభవార్తలు వినే  అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏర్పడిన మానసిక ఆందోళనలు, తగాదాలు వంటివి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది.  చిన్న పాటి అపవాదులు తప్పవు. అయితే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో బాగా అర్ధమవుతుంది. అయితే వంచనకు గురి అయ్యాము అనే భాధ మిమ్మల్ని వెంటాడుతుంది. వృధా ప్రయాసలు, ప్రయాణాలు వలన ఖర్చు అధికమవుతుంది. పోతే పోయింది  డబ్బు,  కానీ  ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది అని సద్దుకుంటారు. అయితే మీ మాటల్లో కఠినత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి.  ఎవరో ఎదో అన్నారని మీ వ్యక్తిత్వం మార్చుకోవద్దని చెప్పదగ్గ సూచన. మీరు ఓర్పుతో నేర్పుతో ఇంకోసారి ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించండి. 

ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తిగా ఉంటుంది. మీ పని మీది అన్నట్టు ప్రవర్తించడం మంచిది. సాధారణంగా గడుస్తుంది ఈవారం.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలకాలం . అయితే ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ప్రస్తుతం ఉద్యోగమే అనుకూలం. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాల పట్ల సానుకూలత లభిస్తుంది. నూతన ప్రణాళికలకు మంచి సమయం అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రు వర్గంపై విజయాన్ని సాధిస్తారు. ఎవరు అన్ని చెప్పిన మీరు తీసుకునే నిర్ణయాలు లభిస్తాయి. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలకు మంచి సమయం, గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరంలో వివాహానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి తప్పకుండా సానుకూల ఫలితాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలెర్జి వంటి సమస్యలు ఉంటాయి. ఆరోగ్య నియమాలు పాటించడం చాలా అవసరం.


మకరం: వారికి ఈవారం కొంత ప్రతికూలమైన  పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు  పని భారం  పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్ ఉంటుంది. అయితే పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పులేకపోవడం వలన కొంత అసహనం, చికాకుకీ గురి అవుతారు. వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక పరమైన నష్టం కాకపోయినా వస్తు నష్టం  జరిగే అవకాశాలు ఉన్నాయి. చంచలత్వమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆ నిర్ణయాలే మీ ఉన్నతికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత వ్యయ ప్రయాసలు  ఎక్కువగా ఉంటుంది.  కుటుంబ పరంగా అన్నిటా అనుకూలత ఏర్పడుతుంది, కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధు వర్గంతో కొంత కష్టాలు, మనస్పర్ధలు, అలజడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి.

ముఖ్యమైన వ్యవహారాల విషయంలో వాయిదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు  కష్టపడి చదుకోవడం చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. విదేశాలలో ఉంటున్న వారికీ ఉద్యోగం లభిస్తుంది, సహనం చాల అవసరం, అన్ని మనకే తెలుసు వాళ్ళు చేప్పేదేమిటి అని కాకుండా మనకి ఎంతవరకు ఉపగోపడుతుంది అని ఆలోచించండి. దాని వలన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలను సంతోష పెట్టడంలో కొంత కష్టపడవలసి వచ్చును. ఎటువంటి విషయాలలో అయిన కూడా వాదనలకు దిగకుండా ఉంటే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మీ పనులు అదే విధంగా సజావుగా పూర్తి అవుతాయి. 


కుంభం: వారికి ఈవారం అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపార, వ్యవహారాలు యందు మీకు కొంత అనుమానం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మకం సన్నగిల్లడం వలన లేనిపోని అపోహల, మిమ్మల్ని నమ్మిన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నమ్మకస్తులైన వారిని కూడా వదులుకునే పరిస్తితి ఏర్పడుతుంది. అందువలన మీరు మీదగ్గర నమ్మకంగా ఉన్నవారిని వదులు కోవద్దు. దాని వలన భవిషత్తులో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు లేనిపోని ఆతురత వలన కొంత కష్టాలు-నష్టాలు, అలాగే పని చేసే చోట కానీ, కార్యాలయాలలో కానీ, కుటుంబంలో కానీ, స్త్రీలతో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా చిత్రీకరించేవారు  ఉన్నారు. మాటలో లోపం లేకుండా చూసుకోండి. ఏలినాటి శని ప్రభావం తో పాటు, గురు గ్రహ బలం కూడా తక్కువగా ఉండడం వలన  అనుకున్న పనులు, స్థిరమైన నిర్ణయాల విషయంలో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత నిదానంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనేక విధాలుగా  ఖర్చులు అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  లోన్లకు దూరంగా ఉండడం మంచిది. 

నూతన విద్యా అవకాశాలు ఉన్నవారు సబ్జెక్టు ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇప్పుడు సబ్జెక్టు తీసుకున్నాక పట్టుదల తగ్గకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. భవిష్యత్త్ కార్యాచరణకు, ఉన్నతికి ఉపయోగకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఫలితం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలా అని ప్రయత్నాలు మానకూడదు.  ఫలితాలు నిదానంగా ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది, మనం అనుకున్న సంబంధం కుదిరింది అని సంతోషపడతారు, ఇది అందరికి కాదు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మనోవేదనకు గురి కాకుండా ఉండడం అవసరం. అదే విధంగా గ్యాస్ట్రిక్, నరాలకు సంబందించిన వ్యాధులు, అలాగే చర్మ సంబంధ రుగ్మతలతో బాధపడే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు అవసరం.


మీనం: వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ వారం శుభ కార్యాలకి ప్రణాళికలు వేయడానికి, అలాగే నూతన ప్రణాళికలు ఆరంభించడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కూడా  చేసే పని యందు కొత్త దనం, మార్పులు చేర్పులు,  అలాగే కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి టెక్నీకల్ రంగం  వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహ గతులు బాగున్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  మీరు అందరికి మంచి చేయాలనీ అనుకుంటారు కానీ కొందరు వ్యక్తులు మీ మీద దుష్ప్రచారాలు చేస్తారు, కొన్ని సార్లు ఈ ప్రొఫెషన్లో ఎందుకు వున్నాము అని ఆలోచన చేస్తారు, ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొక్కళ్ళు లాక్కోవాలని చూస్తారు. ఏలిన శని ప్రభావం చేత చేయని తప్పుకు కూడా నింద పడవలసి రావచ్చు, ఎన్ని సంత్సరాలు కష్టపడ్డా జీవితం ఇంతేనా ఇంనెన్నాళ్లు కష్టపడాలి అనుకుంటారు. ఒకరకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ముందు మనతో బాగా మాట్లాడి వెనక మనకు తెలీకుండా గోతులు తీసేవారున్నారు జాగర్త వహించండి, దైవానుగ్రహం మీకు తోడు ఉంటుంది.  

ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన సమయం. మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన  ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ధన లాభము, పనియందు అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబంలో సంతాన పరంగా మంచి అభివృద్ధి, సంతోషము లభించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి-వ్యాపార పరంగా కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా సరే శోభకృత్ నామ సంవత్సరంలో కార్యాచరణ చేయుటకు మంచి సమయం అని చెప్పడంలో సందేహం లేదు. అశ్రద్ధ చేయకండి. మంచి అనుకూలమైన సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే అన్ని విధముల బాగుండడానికి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద వహించండి. అనాలోచిత పనుల వలన మానసిక అశాంతి చోటు చేసుకోవచ్చు. దానివలన విద్య మీద ఏకాగ్రత లోపిస్తుంది. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. మీరు చేరాలని అనుకున్న గమ్యానికి అడుగులు పడతాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తలు అవసరం.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121