దిన ఫలాలు 30-03-2024

దిన ఫలాలు 30-03-2024

మేషం:  వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.


వృషభం: సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. శ్రమ అధికం అవుతుంది. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.


కర్కాటకం: శత్రువర్గం మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.మానసికంగా ఆనందంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది కలిగిస్తాయి.


సింహం: రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి.అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.


కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువర్గంపై పై చేయి సాధిస్తారు.సహోదర సహోదరి వర్గం నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.


తుల: పట్టు విడుపు ధోరణి మంచిది. ఎంత మేలు చేసిన కొంత మంది మొండి వైఖరి మారదు అని గ్రహిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు.


వృశ్చికం: మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార లాభాలలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు.


ధనస్సు:  గృహ, వాహన యోగాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ చేపడతారు.


మకరం: సన్నిహితుల నుండి అతిముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు.


కుంభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి.


మీనం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనకు విద్యా,ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121