దిన ఫలాలు 30-09-2023

దిన ఫలాలు 30-09-2023

మేషం:  చేపట్టిన పనులు దిగ్విజయంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా విజయం వరిస్తుంది.


వృషభం: కొత్త, పాత మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో కలహాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు పోటీ తత్వం కలిగే కాలంగా చెప్పవచ్చు.


మిథునం: అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురైనా నిలకడ మీద సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో చేసే ఆలోచనలు మీ ఆలోచనలై ఉండాలి. లాభాలు వచ్చే దిశగా ఉంటుంది.


కర్కాటకం: ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.


సింహం: భూములు,గృహాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు చేసే నిర్ణయం తుది నిర్ణయం గా ఉంటుంది.


కన్య: స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. కొన్ని కారణాల చేత ఆగిపోయిన పనులు పూర్తి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చే ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.


తుల: ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని నిలబడతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. చేపట్టిన పనులలో ఆలస్యమైన సకాలంలో పూర్తి చేస్తారు. రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వెనుక ముందు ఆలోచించండి.


వృశ్చికం: సంతానం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కొందరితో ఏర్పడిన పేచీలు పెటాకులు అవుతాయి. కొన్ని విషయాలలో ఊరట చెందుతారు.


ధనస్సు:  సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ,ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి - వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.


మకరం: రుణ బాధలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు చాలా అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆకస్మిక లాభాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.


కుంభం: ఇంటాబయటా మీదేపై చేయిగా ఉంటుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. వారితో కష్టసుఖాలు సంభాషిస్తారు. బంధువులు అక్కరకు వచ్చినట్టుగా ఉన్నా అవసరానికి రారు అని అర్థమవుతుంది.


మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి - ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. ఆకస్మికంగా వచ్చే లాభాలకు ఉప్పొంగి పోతారు.


                                                                               

Rasi Phalalu - 2023-09-30 - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121