దిన ఫలాలు 20-03-2024

దిన ఫలాలు 20-03-2024

మేషం:  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తులాభం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.


వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. శుభవార్తలు వింటారు.


మిథునం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.


కర్కాటకం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.


సింహం: భూవివాదాలు తీర నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. ఆకస్మిక ధన లాభం.


కన్య: కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. మానసికంగా ఆనందంగా ఉంటారు.


తుల: ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి. వివాహ విషయ వ్యవహారాలు ఓ కొలిక్కివస్తాయి.


వృశ్చికం: స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.


ధనస్సు:  నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. స్వల్ప ధనలాభం.


మకరం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి.


కుంభం: ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.


మీనం: స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121