దిన ఫలాలు 16-01-2024

దిన ఫలాలు 16-01-2024

మేషం:  కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమే మిగులుతుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం.


వృషభం: దీర్ఘకాలిక సలస్యలు పరిష్కరమై ప్రశాంతత పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన సౌఖ్యం.


మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు సేకరణ.


కర్కాటకం: మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. సభలు, సమావేశాలకు హజరవుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనలాభం.


సింహం: ఆప్తులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరామై ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భూవివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.


కన్య: బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. సమస్యలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన యోగం. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.


తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. విందు, వినోదాలు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


వృశ్చికం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి.


ధనస్సు:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి. పూర్వపు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.


మకరం: ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.మానసికంగా ఆనందంగా ఉంటారు.


కుంభం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది.


మీనం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకుంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121