దిన ఫలాలు 15-03-2024

దిన ఫలాలు 15-03-2024

మేషం:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.


వృషభం: ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.


మిథునం: గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.


కర్కాటకం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు.


సింహం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులకు స్థాయికి తగిన హోదాలు దక్కుతాయి. ధనలాభం.


తుల: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు సేకరణ.ఆకస్మిక ధన లాభం పొందుతారు.


వృశ్చికం: బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.


ధనస్సు:  వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు.


మకరం: ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు.


కుంభం: సంఘ సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. స్వల్ప ధనలాభం.


మీనం: పనులు నిదానంగా సాగుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121