దిన ఫలాలు 12-10-2023

దిన ఫలాలు 12-10-2023

మేషం:  ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. సంతాన పరంగా ఉన్న ఆందోళనలు తొలుగుతాయి. సంతానం చేపట్టిన కార్యక్రమాలలో కార్యసిద్ధి లభిస్తుంది.


వృషభం: ఉద్యోగాలలో స్థాన మార్పులు. ఉన్నత హోదాలతో బదిలీలు కలసివస్తాయి. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు.


మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంత వరకు తొలుగుతాయి. ఆరోగ్యం పరంగా అశ్రద్ధ వహించకండి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.


కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి - వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్త. ధనలాభం అందుకుంటారు. వస్తులాభం.


సింహం: ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. కుటుంబ నభ్యులలో ఏర్పడిన తగాదాలు సద్దుమణిగి, సంతోషంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగచేస్తుంది.


కన్య: స్థిరాస్థి వృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు చేసేటప్పుడు సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన వస్తులాభ ప్రాప్తి.


తుల: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహన యోగం గోచరిస్తున్నది. జీవిత భాగస్వామితో మాట మాట పెరుగుతుంది.


వృశ్చికం: నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొన్ని విషయాలలో ఆచితూచి అడుగులు వెయ్యండి .భూవివాదాలు తీర నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వనూలు అవుతాయి. శుభవార్తలు.


ధనస్సు:  ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి. నూతన వస్తుసేకరణ. బంధువుల నుండి సానుకూల సమాచారం అందుతుంది. గుడ్డిగా ఎవర్నీ నమ్మవద్దు.


మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనులో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడిలు తొలిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం లభిస్తుంది.


కుంభం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి-వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మాట ఒకటి పని ఒకటి లాంటి పనులు వద్దు.


మీనం: షేర్లు, భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి తరపు నుండి ధనలాభం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు స్వంతం చేసుకుంటారు. ఆర్దిక లావాదేవీలలో కొంత మెలకువ అవసరం.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121