దిన ఫలాలు 02-03-2024

దిన ఫలాలు 02-03-2024

మేషం:  ఋణాలు కొంత వరకు తీరుస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


వృషభం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు.


మిథునం: ముఖ్యమైన వృవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.


కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైన ఓర్పుతొ అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు.


సింహం: అనుకోని అతిథులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు పరపతి పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. స్వల్ప ధన ప్రాప్తి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.


తుల: వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు.


వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ధకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


ధనస్సు:  ఋణ వత్తిడులు ఎదురైనా అంత ఇబ్బందికరంగా ఉండవు. దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటు పాట్లు ఏర్పడవచ్చు.


మకరం: భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో స్వల్ప కలతలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తాయి.


కుంభం: పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు.


మీనం: మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకొంటారు.వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121