Nagchandreshwar Temple Ujjain History

Nagchandreshwar Temple Ujjain History

ఉజ్జయినిలో ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయం... ఈరోజు నాగపంచమి సందర్భంగా తెరుచుకున్న ఆలయం తలుపులు.... మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ ‘ నాగపంచమి ‘*నాడు తెరవబడుతుంది.


సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు.


Shop Now  For SravanMasam Special  : https://shorturl.at/ipxS3

నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.


దేవాలయం లోపలిభాగంలో, విఘ్నేశ్నర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహం సర్పతల్పంపై ప్రతిష్టించబడి ఉంటుంది.


సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై ఉంటాడు. ఈరోజు నాగపంచమి సందర్భంగా దేవాలయం తెరచి అభిషేకం చేస్తున్న అర్చకులు.