Magamasam

Magamasam 

పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?

 

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు '--శి-వా-' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ

 

శివరాత్రి పూజా విధానం


ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుడి వద్దకు వెళ్ళి శివరాత్రి ప్రాశస్త్యం గురించి వివరించమని అడిగింది. దానికి పరమశివుడు తనకు శివరాత్రి ఉత్సవం ఎంతో ఇష్టమని, ఎప్పుడూ ఏమీ చేయకపోయినా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నా సరే తాను సంతోషిస్తానని తెలిపాడు. శివరాత్రి రోజున పగలు ఉపవాసం ఉండి నియమనిష్టలతో పూజించాలి.

శ్రీ పంచమి / వసంత పంచమి

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుకుంటారు. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి.

   మహాశివరాత్రి

 

మాఘమాసం కృష్ణపక్షం, చతుర్ధశి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లుగా స్కాంద తదితర పురాణగ్రంథాలు తెలియజేస్తున్నాయి. చతుర్ధశి పగటిసమయం అయినా ఆ రోజు అర్థరాత్రి లింగోద్భవ సమయంగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సాంప్రదాయంగా వస్తుంది. ప్రతీ నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి రోజు శివుడికి అత్యంత  ప్రీతిపాత్రమైన రోజు.

రథసప్తమి ప్రత్యేకం 


ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది  ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన  సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది.  

 మాఘమాస గౌరీవ్రత మహత్యం

 
మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించడమే మన సంప్రదాయంలో ఋషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలు ఏమిటో, వాటి వల్ల జన్మజన్మలకు కలిగే నష్టం ఏమిటో వివరంగా తెలపబడింది. 

మాఘమాసస్నాన పుణ్య ఫలితాలను వివరించే కథ ...

పూర్వం ఆంధ్రదేశంలోని ఒక పట్టణంలో సుమంతుడు అనే వాడు ఉండేవాడు. అతని భార్యపేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంట అధర్మపరుడు. అడ్డదారిలో ధనం సంపాదించడమే కాకుండా ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినది అంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఎదో పనిమీద గ్రామం వదిలి వెళ్ళాడు. 

మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...

 

మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు.

 

.owntable span, .owntable a{ background-color: #cc6600; border-radius: 7px; color: #fff; display: block; font-size: 26px; width: 400px; padding: 0 5px; text-align:center; } .owntable td{ border:none;} .owntable span:hover, .owntable a:hover{ background-color:#75C161;}      మాఘమాసం ప్రత్యేకత మాఘమాస స్నానానికి సంబంధించిన కథలు మాఘమాసస్నాన పుణ్య ఫలితాలు మాఘమాస గౌరీవ్రత మహత్యం శ్రీ పంచమి/వసంత పంచమి రథసప్తమి ప్రత్యేకం పరమపవిత్రం భీష్మాష్టమి భీష్మ ఏకాదశి విశిష్ట..

మాఘమాసం ప్రత్యేకత

చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం.'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మృకుండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

Showing 1 to 10 of 12 (2 Pages)