నేడు కృష్ణాంగారక చతుర్దశి

నేడు కృష్ణాంగారక చతుర్దశి

నేడు కృష్ణాంగారక చతుర్దశి

బహుళ చతుర్దశి మంగళవారం కలయిక రోజు యముని , కుజుని పూజించినవారికి కలహ , ఋణ , ఆరోగ్య సమస్యలనుండి విముక్తి కలుగును. ఈ రోజు శివారాధన చేయాలి.ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు , ఒక్క సంవత్సరం మొత్తం సంకష్టహర చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ ఒక్క రోజు చేసే పూజ వల్ల అంత ఫలితం వస్తుందని చెప్పారు.


పూర్వం అవంతీ నగరం లో ఉండేవాడు భరద్వాజమహర్షి , ఒకప్పుడు ఆ భరద్వాజుడు అప్సరసను చూడడంవల్ల ఆయనకి ఒక విధమైనటువంటి మోహము కలిగి దానివల్ల వీర్య పతనం అయింది. ఆయన అద్భుత వీరుడు కాబట్టి అది భూమి మీద పడేటప్పటికి అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన కుమారుడు ఒక బాలుడు ఉదయించాడు , భూమిలో పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి ఆ తర్వాత భరద్వాజునికి అప్పగించింది ఆ మహర్షి ఆ కుమారునికి ఉప నయనం చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్టగా జపించాల్సిందిగా చెప్పాడు. ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నది తీరాన నిష్ఠగా జపిస్తే విగ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏంటో చెప్పమంటే అంగారకుడు నా పేరుతో ఈరోజు మంగళ దాయకంగా కావాలి అని చెప్పి అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగి పోవాలి అని చెప్పి , అలాగే మూడవది దేవతల లాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు , అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడం జరిగింది. ఈరోజు మంగళవారం కావటానికి కారణం ఈ సంఘటన.


అట్లాగే ఎర్రటి వాడు కాబట్టి అంగారకుడు అని ఈ పేరు వచ్చింది. భూమికి పుట్టాడు కాబట్టి "కువలయము" కు అంటే భూమి అని కుజుడు అని కూడా అంటారు. ఈ రోజు మంగళవారం ఈనాడు బహుళ చతుర్దశితో కలిసి వచ్చింది కనుక ఈ వ్రతం చాలా శక్తి కలిగినటువంటిది.

Products related to this article

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)..

$42.00

Sravanamasam Idol

Sravanamasam Idol

Explore the significance and types of idols worshipped during Sravanamasam, an auspicious month in the Hindu calendar. Learn about the different idols and their importance in rituals.Available Sizes:1..

$65.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00