Karthika Puranam
karthika-puranam
కార్తీక సోమవారం విశిష్టత?
కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....
కార్తీక పురాణము - తొమ్మిదవ రోజు పారాయణం
అంగీకసర ఉవాచ: అంతఃకారణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి, సాక్షి - సత్, చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపంగా ఉన్నా పిండశేషమూ, ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప 'ఆత్మ' మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలుగాని, ఆగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ
కార్తీక పురాణము - ఎనిమిదవ రోజు పారాయణం
వశిష్ట ఉవాచ : ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు.
కార్తీక పురాణము - ఏడవరోజు పారాయణం
రాజా! ఎంత చెపినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవీ, చేయకపోవడం వలన పాపం కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను.
కార్తీక పురాణము - ఆరవరోజు పారాయణము
ఓ మహారాజా! కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళూ, పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ నశింపచేసేదీ, ఆయురారోగ్యదాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను విను.
కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము
యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి'
కార్తీక పురాణము - నాలుగవ రోజు పారాయణము
ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు.
కార్తీక పురాణము - మూడవరోజు పారాయణము
'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరయితే భగవద్గీతా పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అన్డునీ పదీ-పదకొండూ అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు.
కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము
బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 'రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయ వంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు
కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.