Karthika Puranam
karthika-puranam
కార్తీక పౌర్ణమి విశిష్టత?
పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
క్షీరాబ్ధి ద్వాదశి :
కార్తీక శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే తులసీవ్రతం అని, క్షీరాబ్ధి శయనవ్రతం అని కూడా అంటారు. కృతయుగంలో ఇదే రోజున దేవతలు-రాక్షసులు అమృతం కోసం మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసి, పాల సంముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
వనభోజనాల విశిష్టత ?
కార్తీక మాసంలో స్నాన, జపతపాలు, అభిషేకాలు ఎంత ముఖ్యమో 'వనభోజనాలు' కూడా అంతే ముఖ్యం. వనం అంటే బ్రహ్మం, కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం, అంటే శ్రీకృష్ణుడి లీలలను
కార్తీకమాసంలో ఏవిధంగా స్నానం చేయాలి?
చేయలేనివారికి ప్రత్యామ్నాయాలు ?
కార్తీకమాసం వచ్చిందంటే శివకేశవుల భక్తులు నదీస్నానాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలో చన్నీళ్ళు మాత్రమే వినియోగించాలి. స్నానం చేసేముందు
కార్తీక పురాణము - ముప్పైవ రోజు పారాయణ
సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...
కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ
నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...
కార్తీక పురాణము - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ
సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో,
కార్తీక పురాణము - ఇరవై ఏడవ రోజు పారాయణ
విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.
కార్తీక పురాణము - ఇరవై ఆరవరోజు పారాయణ
విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు.