ఉపవాసాల ఏకాదశి

ఉపవాసాల ఏకాదశి

ఉపవాసాల ఏకాదశి

 నవంబర్ 26 మంగళవారం ఉత్పన్న ఏకాదశి సందర్భంగా...

కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.

ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయననుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే ముక్తి పొందుతారు. ఉత్పన్న ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసీ దళాలను నములుతూ వుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటినుంచి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి పక్వాహారమూ తీసుకోకుండా ఉండాలి. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. మనలను మనం స్వస్థత పరచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. 

Products related to this article

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)..

$42.00

 Copper Adjustable  Multi Color Finish Kids Bangles ( Free Size )

Copper Adjustable Multi Color Finish Kids Bangles ( Free Size )

                                       Copper Adjustable  Multi Color Finish Kids Bangles ..

$3.00