శ్రీకృష్ణుని మరో రూపం #హరిదాసుడు

శ్రీకృష్ణుని మరో రూపం #హరిదాసుడు

సంక్రాంతి ముందు ధనుర్మాసం లో మాత్రమే, హరిదాసులు కనపడతారు.  మళ్ళీ సంవత్సరం దాకా రారు...

శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే, మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగి పోతాయి.

హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని, వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని, దీవించేవారు హరిదాసులు.

నెలరోజులు పాటు హరినామాన్ని గానం చేసినందుకు, చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య , వస్తు దానాలను స్వీకరిస్తారు. Shop Now For Sankranthi  Special :https://www.epoojastore.com/special-items/sankranthi-specials

హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను, సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు.

ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే, శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

ఇంటికి తిరిగి వెళ్లే వరకు, హరినామ సంకీర్తన తప్ప, మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక, ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.

శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని, అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి, హరిదాసు రూపంలో, వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.

హరిదాసు  పేద, ధనిక భేదం లేకుండా, అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందూ ఆగడు.

’శ్రీమద్రమారమణ గోవిందో హరీ’ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ, ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు.

అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే, ఇంటి యజమానులు గుమ్మాలలో      ధాన్యంతో  సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని, శ్రీమహా విష్ణువుకు కానుకగా బహూకరించినట్లుగా, భక్తులు భావిస్తారు.

హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా, శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.హరిదాసులు సామాజిక సంరక్షకులని, చినజీయర్స్వామి అన్నారు. శ్రీరామానుజాచార్యులు చూపిన బాటలో, వీరంతా పయనిస్తున్నారని పేర్కొన్నారు.

హరిదాసు వస్తే, ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి, అక్షయ పాత్రలో బియ్యం పోయండి. మన ఆచారాలను మనమే కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనమే కాపాడు కోవాలి


Products related to this article

Pongal Pot

Pongal Pot

Discover the cultural significance and artistic craftsmanship of Pongal Pot Kondapalli Toys. Explore the traditional handmade toys depicting the essence of Pongal festival. Order your Pongal Pot Konda..

$9.00

Sankranthi Set

Sankranthi Set

Celebrate the joy of Sankranthi with Sankranthi Set Kondapalli Toys - handmade toys capturing the essence of the traditional Sankranthi festival. Explore the intricate craftsmanship and cultural signi..

$31.00