పాక్షిక చంద్రగ్రహణం

పాక్షిక చంద్రగ్రహణం

శ్రీ గురుభ్యోన్నమః

శ్రీ మహాగణాధిపతయే నమః

    పాక్షిక చంద్రగ్రహణం సమయం

  స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో 


రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

       అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది. 

 స్పర్శ కాలం (పట్టు)    రాత్రి   గం 01 : 05 ని//లు 

 మధ్య కాలం(మధ్య)    రాత్రి  గం 01 : 44 ని//లు

    మోక్షకాలం  (విడుపు)  రాత్రి  గం 02 : 22 ని//లు

గ్రహణం ఆద్యంతపుణ్యకాలం గం 01 : 17 ని//లు

1 గంట 17 నిమిషాలు గ్రహణ సమయం. 


ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మరియు మేషరాశి నందు సంభవించుచున్నది కావున అశ్విని నక్షత్ర జాతకులు మరియు మేషరాశి వారు గ్రహణం 

చూడరాదు, అలాగే గ్రహణ అనంతరం తరువాత రోజు ఉదయం యధావిధిగా గ్రహణ శాంతి చేసుకొనవలెను. మరుసటి రోజు 29.10.2023 ఆదివారం గ్రహణశూల కావున దూరప్రయాణములు చేయరాదు. 


ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది

అశ్వినీ భరణీ, కృత్తికా 1వపాదం మేషరాశివారు చూడరాదు. కుంభం, వృశ్చికం, కర్కాటకం, మిథునం రాశుల వారికి శుభఫలం. 

తుల, ధనస్సు, సింహం, మీన రాశుల వారికి మధ్యమం. 

మేషం, వృషభం, కన్య, మకరం రాశుల వారికి అధమఫలం. 


 గ్రహణశాంతి: గ్రహణ దోషమున్నవారు, 

మేషం, వృషభం, కన్య, మకరం రాశుల వారు గ్రహణశాంతి చేసుకోవాలి. 29-10-2023 ఆదివారం ఉదయం మినుములు 1.1/4 కేజి, బియ్యం 1.1/4 

కేజీ, వెండినాగ పడగను, వెండి చంద్రబింబమును, పాలు, తెల్లనివస్త్రం, దక్షిణ, ఆవు నేతితో నింపిన రాగి పాత్రతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చి గ్రహణ పరిహారం చేసుకోగలరని శాస్త్రవచనము. 

 ఈ విధంగా చేయలేనివారు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించిన గ్రహణశాంతి కలుగగలదు.


Performing Devi Sukhta Sahitha Subramanya Pasupatha Homam and Rudrabhishekam on Nov 5th 


గ్రహణశాంతికి దేవి సూక్త సహిత సుబ్రమణ్య పాశుపత హోమం మరియు రుద్రాభిషేకం చేయించాలి.


ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మరియు మేషరాశి నందు సంభవించుచున్నది కావున అశ్విని నక్షత్ర జాతకులు మరియు మేషరాశి వారు గ్రహణం చూడరాదు, 


మేషం, వృషభం, కన్య, మకరం రాశుల వారు గ్రహణశాంతి చేసుకోవాలి.

Register Here :

https://shorturl.at/dpCOU