ఏ దిక్కుగా కూర్చుని భోజనం చేస్తే ఏం ఫలితం?
సిరిసంపదలను, అష్టైశ్వర్యాలను కోరుకునేవారు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీర్ఘాయువును కోరుకునేవారు తూర్పు ముఖంగానూ, కీర్తిప్రతిష్టలను ఆశించేవారు దక్షినాభిముఖంగానూ కూర్చుని భోజనం చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. భోజనం చేసే సమయంలో ఇతర ఆలోచనలకు తావులేకుండా మొదట తీపిపదార్థాలను, మధ్యలో ఉప్పు, పులుపు, కారం, చివరన వగరు, చేదు ముందు ద్రవపదార్థాన్ని, మధ్యలో గట్టి పదార్థాలను, తరువాత ద్రవపదార్థాలను తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదంలో పొందుపరచబడింది. ఏమిటంటే తల్లిదండ్రులు ఉన్నవారు దక్షిణముఖంగా కూర్చోకూడదట, ఉత్తరాముఖంగా కూర్చుని భోజనం చేయకూడదట.